• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి 'వారణాసి'.. ఆ...

రాజమౌళి 'వారణాసి'.. ఆ తొమ్మిది రత్నాల కథేంటి!

| రామాయణం విడుదలతో వారణాసి కథపై కొత్త ఫ్యాన్ థియరీలు వైరల్ అవుతున్నాయి. రెడ్డిట్‌లో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్ర కుంభకర్ణుడి పునర్జన్మగా, రావణుడి నవరత్నాల కోసం మహేష్ బాబు పాత్ర రుద్రను పంపిస్తాడని ఊహిస్తున్నారు. ఈ క్రమంలో రుద్ర రామాయణ కాలానికి టైమ్ ట్రావెల్ చేస్తాడనేది మరో ఆసక్తికరమైన అంచనా. అయితే ఇవన్నీ అభిమానుల ఊహాగానాలే.

By - M Prashanth
Update: 2026-11-09 10:28 GMT

రణబీర్ కపూర్ 'రామాయణం' థియేటర్లలోకి వచ్చిన తర్వాత పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇతర సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో కొత్త థియరీలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి, మహేష్ బాబు 'వారణాసి' కథను రామాయణంతో లింక్ చేస్తూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రావణుడికి చెందిన నవరత్నాల మాల చుట్టూ సినిమా కథ తిరుగుతుందనే ఓ థియరీ రెడ్డిట్‌లో ప్రచారంలోకి వచ్చింది. దీనికి పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రను కూడా కలిపారు.

ఈ థియరీ ప్రకారం కుంభ పాత్ర కుంభకర్ణుడి పునర్జన్మ అట. గత జన్మలో రావణుడికి చెందిన నవరత్నాల మాలను తిరిగి సంపాదించుకోవడమే అతడి లక్ష్యమని ఊహిస్తున్నారు. ఆ మాలలో తొమ్మిది శక్తివంతమైన రత్నాలు ఉంటాయని, కాలక్రమంలో అవి ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నాయని కథ అల్లారు. వాటన్నింటినీ ఒకచోట చేర్చేందుకు కుంభ పెద్ద ప్లాన్ వేస్తాడట.

అయితే ఆ రత్నాలను వెతికి తీసుకొచ్చే బాధ్యత మహేష్ పోషిస్తున్న రుద్ర పాత్రకు అప్పగిస్తాడని చెబుతున్నారు. దీంతో రుద్ర ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుందట. ఇప్పటికే 'వారణాసి' కాన్సెప్ట్ వీడియోలో ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాలకు సంబంధించిన విజువల్స్ కనిపించాయి. వాటిని నవరత్నాల అన్వేషణతో కలిపి ఈ కథను తయారు చేశారు. ముఖ్యంగా తొమ్మిది రత్నాల కోసం తొమ్మిది ప్రాంతాల్లో రుద్ర సాహసాలు చేస్తాడనే ఊహ కూడా ఇందులో ఉంది.

ఇక ఈ ప్రయాణంలోనే టైమ్ ట్రావెల్ అంశం మొదలవుతుందట. ఓ వార్మ్‌హోల్ ద్వారా రుద్ర రామాయణ కాలానికి చేరుకుంటాడని థియరీలో పేర్కొంటున్నారు. అక్కడ రాముడు, రావణుడి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ కీలక సంఘటనలో జోక్యం చేసుకుంటాడట. ఆ సంఘటన కారణంగా నవరత్నాల భవిష్యత్తు మారిపోతుందని, ప్రస్తుతం కుంభ చేస్తున్న ప్రయత్నాలకు దానితో సంబంధం ఉంటుందని ఊహిస్తున్నారు.

మరోవైపు కుంభ అనే పేరును కుంభకర్ణుడితో ముడిపెట్టడం ఈ కథలో హైలెట్ పాయింట్. రాజమౌళి ఇప్పటికే మహేష్‌ను రుద్రగా, పృథ్వీరాజ్‌ను కుంభగా పరిచయం చేశారు. సినిమాలో రామాయణ ఘట్టం కూడా ఉండటంతో ఈ రెండు పాత్రలకు పురాణాలతో సంబంధం ఉందనే ఊహలు వస్తున్నాయి. ముఖ్యంగా కుంభకర్ణుడు మరో జన్మలో తన సోదరుడి ఆస్తిని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించారనీ తెలుస్తోంది.

ఇదంతా రెడ్డిట్‌లో వచ్చిన ఫ్యాన్ థియరీ మాత్రమే. అయితే 'వారణాసి'లో మహేష్ రాముడిగా కనిపించే ఎపిసోడ్ కోసం రాజమౌళి భారీగా కసరత్తు చేశారు. ఈ ఘట్టం చిత్రీకరణకు దాదాపు 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. మహేష్ కూడా రాముడి పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఇక త్వరలోనే సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడేమైనా కథపై ఇంకాస్త క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    
  • varanasi 
  • maheshbabu 
  • ssrajamouli 
  • prithviraj 
  • ramayana 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS