రజినీకాంత్ 'ధర్మన్'.. డెడ్లీ డాక్టర్ వెనుక డార్క్ స్టోరీ
దీనికి సంబంధించి మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్ డిజైన్ చూస్తేనే ఇందులో ఒక డార్క్ థీమ్ ఉన్నట్లు అర్థమవుతోంది.
తలైవర్ 173 ప్రాజెక్ట్‌పై మేకర్స్ ఒక సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ మూవీకి 'ధర్మన్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్ డిజైన్ చూస్తేనే ఇందులో ఒక డార్క్ థీమ్ ఉన్నట్లు అర్థమవుతోంది.
పోస్టర్‌లో రజినీకాంత్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆపరేషన్ థియేటర్ బ్యాక్ గ్రౌండ్‌లో సూట్ వేసుకుని, చేతిలో రక్తం అంటిన సర్జికల్ టూల్ పట్టుకుని ఆయన ఇచ్చిన ఫోజు సినిమా థీమ్‌ని హైలెట్ చేస్తోంది. కింద పడి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి మీద వైట్ స్నీకర్ కాలు పెట్టి చాలా కూల్ గా చూస్తున్న తలైవర్ లుక్‌లో ఒక డార్క్ యాక్షన్ వైబ్ క్లియర్ గా కనిపిస్తోంది. 'డెడ్లీ డాక్టర్' అనే ట్యాగ్ లైన్ కూడా దీనికి పర్ఫెక్ట్ గా సింక్ అయింది.
చెన్నైలో గతంలో ఫేమస్ అయిన 'ఐదు రూపాయల డాక్టర్' రియల్ లైఫ్ స్ఫూర్తితో ఈ స్టోరీ రెడీ చేశారని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. సొసైటీకి మంచి చేసే ఒక సామాన్యుడు, సిస్టమ్ పై ఎలా పోరాడాడు అనే పాయింట్‌ని బేస్ చేసుకుని ఈ కథ సాగనుందని తెలుస్తోంది. కేవలం ఒక ఎమోషనల్ డాక్టర్ కథలా మాత్రమే కాకుండా, ఆ క్యారెక్టర్ వెనుక ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందనే హింట్ ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్‌ను యంగ్ డైరెక్టర్ అశ్వంత్ మారిముత్తు హ్యాండిల్ చేస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎంతోమంది సీనియర్ డైరెక్టర్లు ఉన్నా కూడా, కమల్ హాసన్ లాంటి క్రియేటర్ ఒక కుర్ర ఫిల్మ్ మేకర్‌కు ఈ ఛాన్స్ ఇవ్వడం విశేషం. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా రజినీకాంత్ మాస్ ఇమేజ్‌ని అశ్వంత్ చాలా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తోంది.
ఈ సినిమాలో తలైవర్‌కు జోడీగా ఒకప్పటి సెన్సేషన్ సిమ్రాన్‌తో పాటు రాశీ ఖన్నా కూడా నటిస్తున్నారు. టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబు ఈ సీరియస్ కథలో తన మార్క్ కామెడీతో రిలీఫ్ ఇవ్వబోతున్నాడు. ఇక రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ థీమ్‌కు థియేటర్లలో ఏ రేంజ్‌లో బూస్టప్ ఇస్తుందో ఫ్యాన్స్ ఇప్పటికే అంచనా వేస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా 2027 పొంగల్ టార్గెట్‌గా రాబోతోంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌కి భిన్నంగా, ఒక రియాలిటీ టచ్ ఉన్న యాక్షన్ కథతో రాబోతున్న 'ధర్మన్' కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండ్స్ కలిసిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.