స్పెషల్ సాంగ్స్‌లో శృతి హాసన్ మార్క్!

కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పాత్ర అత్యంత‌ కీలకమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఊగిపోవాల‌న్నా? సినిమా హైప్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లడానికి దర్శకులు ఐటం పాట‌ల‌ను ఎంతగానో నమ్ముకుంటారు.

Update: 2026-06-24 06:22 GMT

కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పాత్ర అత్యంత‌ కీలకమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఊగిపోవాల‌న్నా? సినిమా హైప్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లడానికి దర్శకులు ఐటం పాట‌ల‌ను ఎంతగానో నమ్ముకుంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో స్పెషల్ నెంబర్స్‌తో అలరించడానికి ప్రయత్నించారు. అయితే అమ్మ‌డు చేసిన ఈ తరహా పాటలు ఆశించిన స్థాయిలో థియేట్రికల్ కిక్ ఇవ్వలేక పోతున్నాయనే చర్చ ఇండస్ట్రీ స‌హా ప్రేక్షకుల్లోనూ బలంగా వినిపిస్తోంది.

శృతి హాసన్ నటి మాత్రమే కాదు. మంచి సంగీత పరిజ్ఞానం ఉన్న రాక్‌స్టార్ కూడా. అమ్మ‌డి బాడీ లాంగ్వేజ్, స్టైలింగ్ ఎప్పుడూ వెస్ట్రన్ టచ్‌తో విభిన్నంగా ఉంటాయి. అయితే పక్కా మాస్ ఐటం సాంగ్స్‌కు కావాల్సిన రా ఎనర్జీ, ఊర మాస్ ఎక్స్‌ప్రెషన్స్ శృతి బాడీ లాంగ్వేజ్‌కు అంతగా సెట్ కావడం లేదనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. శ్రుతి క్లాస్ అండ్ మోడ్రన్ అప్పీల్, మాస్ బీట్స్‌తో కూడిన ఐటం సాంగ్స్ లోని నాటుదనంతో పూర్తి స్థాయిలో సింక్ కాలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత సౌత్ సినిమా మార్కెట్‌లో స్పెషల్ సాంగ్స్ బెంచ్‌మార్క్ చాలా పెరిగిపోయింది. సమంత `ఊ అంటావా మావా` సృష్టించిన సెన్సేషన్ గానీ, తమన్నా `కావాలయ్యా` అంటూ చేసిన రచ్చ గానీ థియేటర్లను షేక్ చేశాయి. పూజా హెగ్డే సైతం కొన్ని ప్రత్యేక గీతాల్లో తన గ్లామర్, గ్రేస్‌తో థియేటర్లలో ఈలలు వేయించింది. వీరితో పోల్చి చూసినప్పుడు శృతి హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ అమ్మ‌డు ఎంచుకున్న హుక్ స్టెప్స్ ఆ స్థాయిలో వైరల్ కాలేకపోయాయి. ఫలితంగా సగటు ప్రేక్షకుడికి థియేటర్లలో ఆశించిన మాస్ యుఫోరియా దొరకడం లేదన్న వాద‌న తెర‌పైకి వ‌స్తోంది

ప్రత్యేక గీతం సక్సెస్ కావడానికి హీరోయిన్ మాత్రమే సరిపోదు. దానికి సంగీతం, కొరియోగ్రఫీ కూడా అంతే ముఖ్యం. శృతి హాసన్ చేసిన కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో ట్యూన్స్ రొటీన్‌గా ఉండటం ..కొరియోగ్రఫీ నృత్య శైలికి తగినట్లుగా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. గ్లామర్ షో కోసమే పాటను ఇరికించినట్లు అనిపించడం వల్ల ఆమె ఎంత కష్టపడినా థియేటర్లలో ప్రేక్షకులకు కావాల్సిన అసలైన మసాలా ఎనర్జీ అందడం లేదు.

అంతేకాదు శృతి హాసన్ ఇమేజ్ .. రియల్ లైఫ్ పర్సనాలిటీకి ప్రత్యేకమైన క్లాసిక్, ఎడ్జీ లుక్ ఉంటుంది. పక్కా లోకల్ మాస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఐటం సాంగ్స్‌లో ఆమెను చూసినప్పుడు ఆడియన్స్‌కు ఒక రకమైన మిస్‌మ్యాచ్ ఫీలింగ్ కలుగుతోంది. నటనలో, గ్లామర్‌లో ఎక్కడా తగ్గకపోయినా? ఆ పాటల మూడ్‌ను పూర్తిగా ఓన్ చేసుకోవడంలో ఎక్కడో చిన్న వెలితి కనిపిస్తోందని.. అందువల్లే థియేటర్ రెస్పాన్స్ డల్‌గా ఉంటోందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

సినిమా రంగంలో ఒక్క సక్సెస్ సమీకరణాలన్నింటినీ మార్చేస్తుంది. శృతి హాసన్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ తక్కువదేం కాదు. సరైన మాస్ దర్శకుడు, అదిరిపోయే ఐటెం ట్యూన్ ఇచ్చే సంగీత దర్శకుడు, అమ్మ‌డి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కొరియోగ్రఫీ కుదిరితే శృతి సైతం తనదైన ముద్ర వేయగలదు. ప్రస్తుతానికైతే శ్రుతి హాస‌న్ స్పెషల్ సాంగ్స్ ఎంపిక విషయంలో..ఆ పాటల్లో చూపించాల్సిన మాస్ ఎనర్జీ విషయంలో కొంత రీ-కాలిక్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News