NBK111: ఈసారి డబుల్ డోస్ లేకుండా బాలయ్య ఎటాక్!

అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.;

Update: 2026-02-05 22:30 GMT

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ ముందుగా వెతికేది అందులో ఎన్ని పాత్రలు ఉన్నాయని. గత కొంతకాలంగా బాలయ్య చేసే ప్రతీ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండటం ఒక సెంటిమెంట్‌గా మారింది. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాల్లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో ఆయన బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.

​ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి 6 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా గతంలో అనుకున్న చారిత్రక కథను పక్కన పెట్టి, ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే కథలో కూడా భారీ మార్పులు జరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

​సినిమా పాత్రల విషయంలో ఒక క్రేజీ లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయడం లేదని, కేవలం సోలో క్యారెక్టర్‌తోనే అలరించబోతున్నారని సమాచారం. గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఇందులో రెండు పాత్రలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే ఒక పవర్‌ఫుల్ పాత్రపైనే దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఒక్క క్యారెక్టర్ కూడా ఒక గ్యాంగ్‌స్టర్ షేడ్‌లో ఉండబోతోందని సమాచారం.

​ఒకే పాత్రతో బాలయ్య చూపించబోయే విశ్వరూపం ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2027 లక్ష్యంగా ఈ సినిమా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు. డ్యూయల్ రోల్ లేకపోయినా, ఆ ఒక్క పాత్రలోనే మాస్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయని మేకర్స్ నమ్ముతున్నారు.

​చారిత్రక నేపథ్యం నుండి గ్యాంగ్‌స్టర్ డ్రామాలోకి మారిన ఈ కథలో బాలయ్య మేకోవర్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకే పాత్ర ఉన్నప్పుడు ఆ నటనలో ఉండే వేరియేషన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తాయి. గోపీచంద్ మలినేని తన మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లతో బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారట. బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే, క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

​ఇక చాలా కాలం తరువాత బాలయ్య సోలో పర్ఫార్మెన్స్ చూడబోతున్నామాట. మేకర్స్ నుండి వచ్చే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అలాగే సంక్రాంతి రేసులోకి బాలయ్య ఒక ఏడాది ముందుగానే కర్చీఫ్ వేయడం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో బాలయ్య చేసే విధ్వంసం థియేటర్లలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News