ఫ్యాన్స్‌కి ద‌డ‌పుట్టిస్తున్న అర్జున్ క‌పూర్ పోస్ట్‌!

నెపో కిడ్‌ల‌పై నెట్టంట ట్రోలింగ్ జ‌రుగుతుండ‌టం తెలిసిందే. కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు నెపోకిడ్‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంటూనే ఉన్నారు.;

Update: 2026-02-05 18:30 GMT

నెపో కిడ్‌ల‌పై నెట్టంట ట్రోలింగ్ జ‌రుగుతుండ‌టం తెలిసిందే. కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు నెపోకిడ్‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్ విష‌యంలో మాత్రం ఈ విమ‌ర్శ‌లు కొంత అతిగానే జ‌రుగుతున్నాయి. కార‌ణం త‌న కంటే పెద్ద‌దైన‌ మ‌లైకా అరోరాతో డేటింగ్‌లో ఉండ‌టం.. బాహాటంగానే త‌న‌తో ముంబ‌యిలోని బాంద్రా వీధుల్లో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం..తర‌చూ మీడియా కంటికి చిక్క‌డంతో నిత్యం వార్త‌ల్లో నిలిచాడు. అదే విధంగా ట్రోలింగ్‌కు గుర‌వుతూ వ‌చ్చాడు.

కొన్ని నెల‌ల క్రితం మ‌లైకాతో విడిపోయినా అర్జున్ క‌పూర్‌పై ట్రోలింగ్ మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌స్తుత త‌న స్థానానికి త‌ను అర్హుడు కాద‌ని కొంత మంది బాహాటంగానే అర్జున్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లాయంటే అత‌ని వ్య‌క్తిగ‌త జీవితం ప్ర‌భావితం అయ్యే వ‌ర‌కు వెళ్లాయ‌ని తెలుస్తోంది. మ‌లైకాతో తిరుగుతున్న సంద‌ర్భంలో త‌మ‌ని ఫోటోలు తీసేవారిపై దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ వారిని వారించే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చిన అర్జున్ క‌పూర్ ఈ మ‌ధ్య చాలా కూల్ అయిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో త‌న దివంగ‌త మ‌ద‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అర్జున్ పెట్టిన పోస్ట్ అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది. త‌న త‌ల్లిని ఉద్దేశిస్తూ అర్జున్ క‌పూర్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో త‌ను త‌న మ‌ద‌ర్‌ని ఎంత‌గా మిస్స‌వుతున్నాడో స్ప‌ష్టం చేశాడు. త‌నని తీవ్రంగా మిస్స‌వుతున్నాన‌ని వెల్ల‌డించిన అర్జున్ చివ‌ర్లో ..`నేను త్వ‌ర‌లో మిమ్మ‌ల్ని క‌లుస్తాను` అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ని, సినీ సెల‌బ్రిటీస్‌ని కంగారుపెడుతోంది. కార‌ణం 2022, జూన్ 3న‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇదే త‌ర‌హాలో త‌మ మ‌ద‌ర్‌ను ఉద్దేశిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశాడు.

ఆ త‌రువాత కొన్ని రోజుల‌కే సుశాంత్ అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘ‌ట‌న‌ని గుర్తు చేసుకుంటూ అర్జున్ క‌పూర్ అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. ఉన్న‌ట్టుండీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా అర్జున్ క‌పూర్ పోస్ట్ పెట్ట‌డం ఇప్పుడు బాలీవుడ్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంద‌ని, అంద‌రిలోనూ అనుమానాల్ని రేకెత్తిస్తోందిని అంతా వాపోతున్నారు. ఈ పోస్ట్‌పై అభిమానులు, నెటిజ‌న్‌లు భిన్నంగా స్పందిస్తూ అర్జున్ క‌పూర్‌పై పోస్ట్‌లు పెడుతున్నారు.

సుశాంత్ పెట్టిన లాస్ట్ పోస్ట్‌, అర్జున్ షేర్ చేసిన తాజా పోస్ట్ ద‌గ్గ‌రిగా ఉన్నాయ‌ని, త‌ను తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌కు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ క‌పూర్ గ‌త ఏడాది `మేరే హ‌జ్బెండ్‌కి బీవీ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ ఏడాది ఇంత వ‌ర‌కు మ‌రో సినిమా ప్ర‌క‌టించ‌లేదు. హీరోగా కెరీర్ బాగానే ఉన్నా అర్జున్ క‌పూర్‌లో ఉన్న‌ట్టుండి ఈ మార్పుకు కార‌ణ‌మేంట‌ని అభిమానులు, బాలీవుడ్ సెల‌బ్రిటీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News