అదే నిజమైతే సెకెండ్ ఇన్నింగ్స్ మారినట్లే!
కన్నడ బ్యూటీ ప్రియమణి సినీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది.;
కన్నడ బ్యూటీ ప్రియమణి సినీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. కానీ స్టార్ లీగ్ లో మాత్రం చేరలే కపోయింది. మంచి పెర్పార్మర్ అయినా? హీరోయిన్ గా అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదన్నది కాదనలేని నిజం. దక్షిణాదిన అన్ని భాషలతో పాటు హిందీలో కూడా చాలా సినిమాలు చేసింది. అన్ని భాషల్లోనూ అదే పరిస్థితి. ప్రతిభ ఉన్నా? కొన్ని గొప్ప అవకాశాలను కోల్పోయింది. కొత్త నాయికల నుంచి...అప్పటికే స్థిరపడిన నాయికల నుంచి ఉన్న పోటీని తట్టుకోలేకపోయింది.
అందుకు కారణాలు అనేకం కావొచ్చు. అలాగే ప్రియమణి అంటే ప్రత్యేకమైన అభిమానం చూపించే సెలబ్రిటీలు లేకపోలేదు. సందర్భం వచ్చిన సమయంలో ప్రియమణిపై పాజివిటీని వ్యక్తం చేస్తుంటారు. ప్రియమణి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉందంటే కారణం ఆ పాజిటివ్ యాంగిల్ కూడా ఓ రీజన్ గా చెప్పొచ్చు. హీరోయిన్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ప్రయాణం మొదలు పెట్టింది. బుల్లి తెర షోలను సైతం హోస్ట్ చేసింది. ఇలా వచ్చిన ఏ అవకాశాన్ని ప్రియమణి వదులుకోలేదు. ఇండస్ట్రీలో ఏదో పనిలో బిజీగానే గడిపింది. సహాయ నటిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే ప్రయాణాన్ని ముందుకు సాగిస్తోంది.
కష్టే ఫలి అన్న నానుడిని నమ్మి పని చేసుకుంటూ వెళ్తోంది. ఏదో రోజు ఓ మంచి మరో అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడా ఛాన్స్ వచ్చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమాలో ఛాన్స్ అందుకుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సదరు దర్శకుడు చిరు కు పర్పెక్ట్ జోడీగా ప్రియమణిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే? ప్రియమణి కి కెరీర్ టర్నింగ్ అవకాశంగా చెప్పొచ్చు. హీరోయిన్ గా అవకాశాలు రాని రోజుల్లో ఏకంగా మెగాస్టార్ సరసన ఛాన్స్ అంటే చిన్న విషయమా? ఎంతో అదృష్టం కలిసొస్తే తప్ప రాని అవకాశం ఇది.
చిరంజీవితో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు క్యూలో ఉన్నారు. ఒక్క అవకాశం రాదా? అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది పాపులర్ బ్యూటీలు కళ్లు కాయలు కాచేలు చూస్తున్నారు. కానీ వారెవరికీ రాని అవకాశం ప్రియమణికి వస్తే నిజంగా ఆమెను మించిన లక్కీ నటి ఎవరుంటారు. అదే నిజమైతే అక్కడ నుంచి హీరోయిన్ గా మరిన్ని కొత్త అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ల ఇబ్బంది ఎలాగూ ఉంది. వీళ్లకి హీరోయిన్ తీసుకోవడం దర్శకులకు తలకు మించిన భారంగా మారుతోంది. 40 ఏళ్ల ప్రియమణి ఫాంలోకి వచ్చిందంటే? దర్శకులకు పని భారం తగ్గుతుంది. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్ హీరోలకు ప్రియమణి మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.