స్టార్ హీరో వారసుడు ఇలా వీక్ అయితే ఎలా?
కార్తీక్ తమిళ నటుడైనా? తెలుగు అభిమానుల మెచ్చిన ఒకప్పటి స్టార్. `సీతాకొకచిలుక` చిత్రంతో నాటి యువత మనసు దోచిన హీరో.;
కార్తీక్ తమిళ నటుడైనా? తెలుగు అభిమానుల మెచ్చిన ఒకప్పటి స్టార్. `సీతాకొకచిలుక` చిత్రంతో నాటి యువత మనసు దోచిన హీరో. ఒక్క సినిమా అతడికి ఎనలేని క్రేజ్ ని తీసుకొచ్చింది. తమిళ నటుడైనా? తెలుగు నటుడిగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. తెలుగులో అతడు పెద్దగా సినిమాలు చేయలేదు గానీ కార్తీక్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. కోలీవుడ్ లోనే నటుడిగా స్థిరపడ్డారు. ఆ స్టార్ తనయుడే గౌతమ్ కార్తీక్ తెలుగు ఆడియన్స్ సుపరిచిమతే. మణిరత్నం దర్శకత్వం వహించిన `కడలి` సినిమాతో గౌతమ్ కార్తీక్ హీరోగా ఎంటర్ అయ్యాడు.
తండ్రి ఫీచర్స్ ఉన్న గౌతమ్ పెద్ద స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. టాలీవుడ్ ఆడియన్స్ కు గౌతమ్ కనెక్ట్ అవుతాడని తొలి సినిమా సమయంలో ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చా జరిగింది. కానీ గౌతమ్ కార్తీక్ మాత్రం ఇంత వరకూ తెలుగు ఆడియన్స్ రీచ్ అవ్వలేకపోయాడు. కెరీర్ ప్రారంభమై దశాబ్దం దాటినా? ఇప్పటికీ అతడి ప్రతిభ కోలీవుడ్ కే పరిమితమైంది. హీరోగా 15 సినిమాలకు పైగా చేసాడు. కానీ ఆ చిత్రాలేవి కనీసం తెలుగు లోకి అనువాదం కూడా అవ్వలేదు. తొలి సినిమా `కడలి` కూడా ప్లాప్ అయింది. అనంతరం చేసిన సినిమాలేవి అనువదించే సాహసం ఏ నిర్మాత చేయలేదు.
రెండేళ్ల క్రితం వరకూ కోలీవుడ్ లో యాక్టివ్ గానే పని చేసాడు. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం హీరోగా ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. `క్రిమినల్`, ` మిస్టర్ ఎక్స్`, `రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్` అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి వీటికైనా తెలుగు అనువాదం ఉంటుందా? ఉండదా? అన్నది చూడాలి. ఇప్పటికే నటుల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. అన్ని పరిశ్రమల్లోనూ వారసలు హవా కొనసాగుతోంది. ఈ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడాలంటే? అంత సులభం కాదు. కష్టంతో పాటు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి.
మరి గౌతమ్ కారీక్ లో అలాంటి క్వాలిటీలు ఉన్నాయా? లేవా? అన్నది అతడి సక్సెస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది.అలాగే గౌతమ్ కోలీవుడ్ మినహా ఇంత వరకూ ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయలేదు. గూటిలో పక్షిలా సొంత పరిశ్రమకే పరిమితయ్యాడు. మరి కొత్త ఏడాది గౌతమ్ కెరీర్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటాడా? అన్నది చూడాలి. అలాగే కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో గౌతమ్ హీరోయిన్ మంజిమా మోహనన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.