డాట‌ర్స్ నిర్మాత‌ల‌గానేనా? క్రియేటివ్ గా లేరా!

స్టార్ హీరోల వార‌సురాళ్లు చిత్ర రంగంలో ఏదో శాఖ‌లో రాణించ‌డం ప‌రిపాటే. వాళ్ల ఆస‌క్తిని బ‌ట్టి న‌చ్చిన శాఖ వైపు వెళ్లే అవ‌కాశం ఉంటుంది.;

Update: 2025-12-19 00:30 GMT

స్టార్ హీరోల వార‌సురాళ్లు చిత్ర రంగంలో ఏదో శాఖ‌లో రాణించ‌డం ప‌రిపాటే. వాళ్ల ఆస‌క్తిని బ‌ట్టి న‌చ్చిన శాఖ వైపు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. 24 శాఖ‌లు గొప్ప‌వే. కానీ క్రియేటివ్ శాఖ మాత్రం ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా మూడు శాఖ‌ల్లోనూ ప‌ని చేసారు. ప‌రిశ్ర‌మ‌లో యాక్టివ్ గా ఉన్నంత కాలం త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకునే ఓ మంచి ప్ర‌య‌త్నం చేసారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ప‌ని చేసారు. చిరంజీవి హీరోగా న‌టించిన చాలా సినిమాల‌కు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు.

నిర్మాత‌లుగా వార‌సురాళ్లు:

ఇత‌ర హీరోల చిత్రాల‌కు దూరంగా ఉన్నా డాడ్ సినిమాల విష‌యంలో తానే ప‌నిచేసేవారు. తాజాగా నిర్మాత‌గా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ అనే సంస్థ‌ను తానే స్థాపించి డాడ్ తో తొలి చిత్రం `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` నిర్మిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌స్వీ కూడా బాల‌య్య 111వ సినిమాతో నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ శాఖ‌లో సుస్మిత‌, తేజ‌స్వీ స‌క్సెస్ ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. నిర్మాత అంటే కేవ‌లం పెట్టుబ‌డి పెట్ట‌డ‌మే కాదు.

క్రియేటివ్ రంగం ప్ర‌త్యేక‌మైన‌ది:

క‌థ‌ల‌పై కూడా మంచి అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. నిర్మాత‌ల‌గా పోటీ ని ఎదుర్కో వ‌డం అంత సుల‌భం కాదు. ఎప్ప‌టి క‌ప్పుడు అప్డేట్ అవుతూ రాణించాల్సిన రంగం కూడా. ఎంత వ‌ర‌కూ క్రియేటివ్ గా ఉన్నారు? అన్న‌ది కొంత వ‌ర‌కూ వారి నిర్మించిన చిత్రాల స‌క్సెస్ డిసైడ్ చేస్తుంది. కానీ వారివురి నుంచి అభిమానులు అంత‌కు మించి ఆశీస్తు న్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. క్రియేటివ్ రంగంలో స‌క్సెస్ అయితే వ‌చ్చే గుర్తింపు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.డైరెక్ష‌న్, రైటింగ్ అన్న‌ది క్రియేటివిటీతో కూడుకున్న‌ది. హీరోతో స‌మానంగా గుర్తింపునిచ్చేవి ఆ రెండు శాఖ‌లు.ఆ కుటుంబాల నుంచి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నారు.

మ‌ళ్లీ బిజీ అవుతున్నారా?

భ‌విష్య‌త్ త‌రాల‌కు వారి అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి భ‌విష్య‌త్ లో తేజ‌స్వీ, సుస్మిత క్రియేటివ్ రంగాల వైపు అడుగులు వేస్తారా? వారిద్ద‌రిలో అంత స‌త్తా ఉందా? లేదా? అన్న‌ది చూడాలి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ కూడా డైరెక్ట‌ర్ గా, ప్లే బ్యాక్ సింగ‌ర్ గా రాణిస్తున్నారు. `3`, `వెయ్ రాజా వెయ్`, ` సినిమా వీర‌న్`, `లాల్ స‌లామ్` లాంటి చిత్రాలు తెర‌కెక్కించారు. కానీ అనుకున్నంత‌గా ఫేమ‌స్ కాలేక‌పోయారు. అయినా ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కు రాలిగా ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఏడాది కాలంగా కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉన్నా? తాజాగా మ‌ళ్లీ ఆ ప్ర‌య‌త్నాల్లో బిజీ అయిన‌ట్లు తెలిసింది.

Tags:    

Similar News