ఒక్క రోజులోనే కోటిన్న‌ర ఖ‌ర్చు చేసిన నిర్మాత‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్రాగ‌న్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-19 08:19 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్రాగ‌న్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `కేజీఎఫ్‌`, `స‌లార్` చిత్రాల‌ను మించి డ్రాగ‌న్ ఉంటుంద‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ప‌తాక స్థాయిలో జ‌రుగుతోంది. సినిమా నెక్స్ట్ లెవ‌ల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నిండిపోతుంద‌ని అభిమానుల అంచ‌నా వేస్తున్నారు. అందుకు త‌గ్గట్టే సినిమా కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవల చిత్ర యూనిట్ జోర్డాన్ దేశంలోని అందమైన లోకేషన్లలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసింది.

అక్క‌డ ఒక్క రోజు షూటింగ్ కోస‌మే నిర్మాత దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఒకే ఒక్క రోజు షూటింగ్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం అనేది చాలా అరుదుగా జ‌రుగుతోంది. గతంలో `బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాల కోస‌మే ఈ రేంజ్లో ఖ‌ర్చు చేసారు. ఆ త‌ర్వాత మరే చిత్రానికి ఇంత ఖ‌ర్చు రూపంలో జ‌ర‌గ‌లేదు. స‌హ‌జంగా సెట్స్ కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తారు. కానీ వ‌న్ డే షూట్ కోసం మాత్రం కోటి ఖ‌ర్చు చేయ‌డం అన్న‌ది అరుదుగానే చెప్పాలి. కేవలం లొకేషన్ పర్మిషన్లు, భారీ క్రూ వసతి, అత్యాధునిక సాంకేతిక పరికరాల కోసమే ఈ స్థాయిలో వ్యయం చేసినట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే విజువల్ గ్రాండియర్. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలతో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం అంతకు మించిన ఒక పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. జోర్డాన్ వంటి దేశాల్లో షూటింగ్ చేయడం వల్ల వచ్చే విజువల్ క్వాలిటీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఇంత‌ భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ భారీ వ్యయం వెనుక మరో ఇంట్రెస్టింగ్ రీజ‌న్ కూడా ఉంది. షూటింగ్‌లో పాల్గొన్న అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు , భారీ తారాగణం వంటివి కూడా కార‌ణాలే.

యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించారు. రాజీ లేని నిర్మాణం, ప్రశాంత్ నీల్ విజన్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి సినిమాను నెక్స్ట్ లెవ‌ల్లో నిల‌బెట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా `వార‌ణాసి`, బ‌న్నీ సినిమాలు క‌నిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల్ని ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ కి క‌నెక్ట్ చేస్తున్నారు. నాని హీరోగా న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` ను కూడా గ్లోబ‌ల్ స్థాయిలో రిలీజ్ చేయాల‌నే ప్లాన్ లో ఉన్నారు. వీటికి ధీటుగా తార‌క్ చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Tags:    

Similar News