హీరోయిన్ కి రిపోర్టర్ అలాంటి ప్రశ్న.. సోషల్ మీడియాలో ట్రోల్స్!
సెలబ్రిటీలు పబ్లిక్ కాబట్టి ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు, నెటిజన్లు, మీడియా గమనిస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.
సెలబ్రిటీలు పబ్లిక్ కాబట్టి ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు, నెటిజన్లు, మీడియా గమనిస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే సెలబ్రిటీలు పబ్లిక్ లోకి రావాలి అంటే చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసుకునే డ్రెస్ మొదలుకొని ప్రవర్తించే తీరు వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. లేదంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి సెలబ్రిటీలు అనుకోకుండా చేసే పనులకి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఇటీవల ఒక ఈవెంట్ కి కాషాయ రంగు దుస్తుల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. కానీ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఆమెను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. అంతేకాదు సదరు రిపోర్టర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
కాషాయ రంగు దుస్తుల్లో హీరోయిన్..
అసలు విషయంలోకి వెళ్తే... మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను రిపోర్టర్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమె ఒక ఈవెంట్ కి కాషాయ రంగు ధరించి హాజరయ్యింది. అయితే అదే ఈవెంట్ కి వచ్చిన ఒక రిపోర్టర్.. కాషాయ రంగు డ్రెస్ ఎందుకు వేసుకున్నారు ? ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా? అంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి ప్రియా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సదరు రిపోర్టర్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
రిపోర్టర్ పై నెటిజన్స్ ట్రోల్స్..
సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్న చాలా వింతగా ఉంది అంటూ రిపోర్టర్ పై మండిపడుతున్నారు. కేరళలో కాషాయం ధరిస్తే కారణం చెప్పాలా? కనీసం నచ్చిన రంగు డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా ?అని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది ఈ మధ్యకాలంలో కలర్స్ కి కూడా ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి కదా అందుకే ఆయన క్యాజువల్ గా అడిగి ఉండవచ్చు అంటూ పలువురు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా రిపోర్టర్ అడిగిన ప్రశ్న కారణంగా ప్రియా ప్రకాష్ వారియర్ మళ్ళీ వార్తల్లో నిలిచారు.
కన్ను గీటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు..
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ భాషతో సంబంధం లేకుండా పలు భాషా చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందం, అభినయంతో గ్లామర్ డోస్ పెంచేసి కుర్ర కారును తన వశం చేసుకున్న ఈ చిన్నది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు చిత్రాలు..
చెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ తర్వాత ఇష్క్ సినిమాలో అనసూయ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకున్న. ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం కన్నడ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది.