మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా దూకుడు మామూలుగా లేదే!

నిన్న‌టి వరకు తెలుగు సినిమాలతోనే నిరంతరం బిజీగా ఉంటూ సౌత్‌లో అగ్ర కథానాయికగా అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కసారిగా బాలీవుడ్‌లో ఊహించని రీతిలో వేగం పెంచింది.

Update: 2026-09-22 15:30 GMT

నిన్న‌టి వరకు తెలుగు సినిమాలతోనే నిరంతరం బిజీగా ఉంటూ సౌత్‌లో అగ్ర కథానాయికగా అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కసారిగా బాలీవుడ్‌లో ఊహించని రీతిలో వేగం పెంచింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడుస్తున్నా? గ్లామర్‌తో పాటు నటనలోనూ చెక్కుచెదరని ప్రజాదరణతో సరికొత్త ఊపును ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ముద్దుగుమ్మ దూకుడు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. వరుస అవకాశాలతో ఉత్తరాదిలో పట్టును మరింత బలోపేతం చేస్తోంది. అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలుస్తోంది.

ప్రస్తుతం తమన్నా ఖాతాలో ఏకంగా నాలుగు హిందీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. విభిన్నమైన కథాంశాలు, వైవిధ్యభరితమైన పాత్రలతో రూపొందుతున్న చిత్రాల్లో అమ్మ‌డు కీలక పాత్రలు పోషిస్తోంది. కామెడీ, డ్రామా, యాక్షన్ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ వరకు ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీటిలో కొన్ని సినిమాల షూటింగ్‌లు ముగింపు దశకు చేరుకోగా, మరికొన్ని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుం టున్నాయి.

ఈ నాలుగు ప్రాజెక్ట్‌లే కాకుండా బాలీవుడ్‌లో మరో రెండు భారీ చిత్రాలకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తికానున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఒకేసారి అరడజను హిందీ ప్రాజెక్ట్‌లను చేతిలో ఉంచుకోవడం తమన్నా క్రేజ్‌కు అద్దం పడుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతోనే సందడి చేసిన భామ ఇప్పుడు ఉత్తరాది దర్శక-నిర్మాతలకు ప్రాధాన్యత ఇవ్వ‌డం విశేషం.

గ్లామరస్ పాత్రలకే పరిమితమైన తమన్నా కొంత కాలంగా డిజిటల్ , థియేట్రికల్ ప్లాట్‌ఫామ్‌లలో వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఓటీటీ ప్రాజెక్ట్‌లు, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీని నిర్మించుకుంది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా కథలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న రోల్స్‌ను ఎంచుకుంటూ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

మరోవైపు త‌మ‌న్నాని అగ్ర కథానాయికగా నిలబెట్టిన సౌత్ సినిమాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు బాలీవుడ్ చిత్రాలను సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటోంది. భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా పాన్-ఇండియా రేంజ్‌లో బిజీగా ఉంటూ డేట్స్ కేటాయిస్తోంది. ఆమెలోని ప్రొఫెషనిజం, టైమ్ మేనేజ్‌మెంట్ , వర్క్ ఎథిక్స్ ఇన్ని సంవత్సరాలైనా త‌మ‌న్నాను మోస్ట్ వాంటెడ్ నటిగా నిలబెట్టాయి.

కొత్త కథానాయికల పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా? ఫిట్‌నెస్, సమకాలీన ట్రెండ్స్‌కు తగ్గట్లు మారే తత్వంతో మిల్కీ బ్యూటీ విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలు, సంతకం చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌లు విడుదలవుతే బాలీవుడ్‌లో తమన్నా మార్కెట్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. సౌత్ నుంచి నార్త్ వరకు త‌మ‌న్నా విస్తరించుకుంటూ సాగిస్తున్న ప్రయాణం తోటి నటీమణులకు సైతం స్ఫూర్తినిస్తోంది.

Tags:    

Similar News