యవ హీరోల్లో ఏకైక అదృష్ట వంతుడు!
గ్లామర్ ప్రపంచంలోకి స్వశక్తితో నిలదొక్కుకోవడం ఎంతోమంది కల. కానీ అందరి కల నెరవేరదు.
గ్లామర్ ప్రపంచంలోకి స్వశక్తితో నిలదొక్కుకోవడం ఎంతోమంది కల. కానీ అందరి కల నెరవేరదు. అలా కొంత మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఆవగింజంత అదృష్టం కూడా కలిసొస్తేనే అలాంటి అద్భుతాలకు అవకాశం ఉంటుంది. పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సాధించి అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగత జీవితంలోనూ అనుకున్నది సాధించిన ఓ యువ హీరోని ఈ తరం నటుల్లోనే ఏకైక అదృష్టవంతుడిగా చెప్పొచ్చు. ఆయన ప్రయాణం కష్టపడటానికే పరిమితం కాలేదు. ప్రతీ సందర్భంలోనూ అదృష్టం తోడై నడిపించిన చందంగా సాగింది.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చినా? తనదైన విలక్షణ నటనా శైలితో యూత్ ఐకాన్‌గా మారడం అతడు సాధించిన మొదటి విజయం. తొలినాళ్లలోనే ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకుని కుర్రకారులో మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. నటుడిగానే గాక తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మించుకో వడంలో అతడు సంపూర్ణంగా సఫలీకృతులయ్యాడు. కెరీర్ ప్రయాణంలో కొన్ని పరాజయాలు ఎదురైనా? అతడికున్న క్రేజ్ , మార్కెట్ వ్యాల్యూ మాత్రం ఎక్కడా తగ్గలేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగాడు.
అతడి బాడీ లాంగ్వేజ్, వేదికలపై మాట్లాడే ధైర్యం, ఆత్మవిశ్వాసం అతడిని తోటి హీరోల కంటే భిన్నమైన స్థానంలో నిలబెట్టాయి. వృత్తిపరమైన విజయాలతోనే కెరీర్ ముందుకు సాగలేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆ యంగ్ హీరోని అదృష్టం వరించింది. కెరీర్ ఆరంభంలో తనతో కలిసి నటించిన ఓ అగ్ర కథానాయికతో కుదిరిన పరిచయం, కాలక్రమేణా గట్టి అనుబంధంగా మారింది. వెండితెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న కాంబినేషన్ ప్రేక్షకుల హృదయాల్లో బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
రీల్ లైఫ్ కెమిస్ట్రీని రియల్ లైఫ్ భాగస్వామ్యంగా మలుచుకోవడంలో యువ హీరో నూరుశాతం విజయం సాధించాడు. భారీ డిమాండ్.. క్రేజ్ ఉన్న నటిని ప్రేమించి, వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఆయువ హీరో జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపారమైన ఆదరణ ఉన్న ఇద్దరు నటులు ఒకే ఇంట్లో జంటగా నిలవడం ఇద్దరి ప్రతిష్టను మరింత పెంచింది.
పరిశ్రమలో సొంతంగా గుర్తింపును నిర్మించుకోవడం, అగ్ర నటుడిగా ఎదగడం, ఆపై అదే రంగానికి చెందిన సరిజోడీని భాగస్వామిగా పొంది సుఖసంతోషాలతో జీవించడం అందరికీ సాధ్యపడదు. వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ గొప్ప విజయాన్ని అందుకుంటూ అపారమైన అభిమాన గణాన్నీ, దేవుడి ఆశీస్సులనూ పొందిన ఆ యువ హీరో నిజంగానే పరిశ్రమలోని అదృష్టవంతుల్లో అగ్రస్థానంలో ఉండాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.