తెలుగు మార్కెట్‌ మిస్‌ చేసుకున్న 'డీసీ'

ఇప్పుడు లోకేష్ కనగరాజ్‌ హీరోగా నటించిన డీసీ సినిమా పరిస్థితి అలాగే ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2026-08-06 06:17 GMT

తమిళ స్టార్‌ హీరోల సినిమాలు, స్టార్‌ డైరెక్టర్స్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. తమిళ సినిమాలు మంచి కంటెంట్‌తో వస్తే కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు కావడం మనం చూస్తూనే ఉన్నాం. తమిళ సినిమాలు డబ్బింగ్‌ వర్షన్‌తో వంద కోట్లు, అంతకు మించిన వసూళ్లు నమోదు చేసిన విషయం సైతం తెలిసిందే. సరిగ్గా ప్రచారం చేస్తే తెలుగు సినిమాల స్థాయిలో తమిళ డబ్బింగ్‌ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ దక్కించుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలను సరిగ్గా ప్రమోట్‌ చేయక పోవడంతో థియేటర్‌లో చూడకుండా ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సందర్భౄలు ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్‌ హీరోగా నటించిన డీసీ సినిమా పరిస్థితి అలాగే ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్‌ హీరోగా...

కమల్ హాసన్‌తో 'విక్రమ్‌', రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాలు తీసి స్టార్‌ దర్శకుల జాబితాలో నిలిచిన లోకేష్ కనగరాజ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సైతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖైదీ సినిమా వచ్చినప్పటి నుంచి లోకేష్‌ కనగరాజ్‌ గురించి తెలుగు మీడియాలో ప్రముఖంగా వస్తూనే ఉంది. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి లోకేష్ కనగరాజ్‌ హీరోగా మారి చేసిన 'డీసీ' సినిమాకు తెలుగులో మంచి క్రేజ్‌ దక్కడం ఖాయం. అయితే మేకర్స్‌ ఆ దిశగా ప్రయత్నం చేయక పోవడంతో డీసీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియనే లేదు. లోకేష్ కనగరాజ్‌ నటించిన డీసీ సినిమా రేపు తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల కాబోతుంది. తెలుగులో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కనీసం ప్రచారం చేయలేదు.

తెలుగులో విడుదల కానున్న డీసీ...

తెలుగు వర్షన్‌ విడుదల విషయంలో ఇండస్ట్రీ వర్గాల వారికి సైతం చివరి నిమిషం వరకు క్లారిటీ లేదు. సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత అయినా కనీసం ప్రమోషన్‌ చేయడం ద్వారా డీసీకి మినిమం ఓపెనింగ్స్ దక్కి ఉండేవి. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం పట్టించుకోక పోవడంతో డీసీ సినిమాను తెలుగులో పబ్లిసిటీ చేయలేదు. తెలుగులో ఆయనకు ఉన్న క్రేజ్‌తో పాటు, మంచి పేరు కారణంగా స్టార్స్‌, సెలబ్రిటీలు ఆయన ఒక్క మాట అడిగితే డీసీని ఫుల్‌గా పబ్లిసిటీ చేసే వారు. కానీ డీసీ సినిమా విషయంలో లోకేష్ పెద్దగా దృష్టి పెట్టలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు విడుదల కాబోతున్న డీసీ సినిమాకు సంబంధించిన లుక్స్‌, ప్రమోషన్‌ వీడియోలు మంచి కంటెంట్‌ ఉండే అవకాశం ఉంది అనిపించే విధంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం.

టాలీవుడ్‌లో కొరియన్‌ కనకరాజు...

లోకేష్ కనగరాజ్‌కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో తమిళనాట కచ్చితంగా మినిమం వసూళ్లు నమోదు కావడం ఖాయం. కంటెంట్‌ బాగుంటే భారీగానే వసూళ్లు నమోదు అవుతాయి. కానీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయక పోవడంతో పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. విడుదలకు ముందు వారం రోజులు కాస్త హడావిడి చేసి ఉంటే తప్పకుండా సినిమా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. తద్వారా మినిమం ఓపెనింగ్ అయినా నమోదు అయ్యి ఉండేవి అనేది విశ్లేషకుల మాట. తెలుగులో మెగా హీరో వరుణ్‌ నటించిన కొరియన్‌ కనకరాజు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా జోరు ముందు డీసీ సినిమా పెద్దగా థియేటర్‌లలో సందడి చేయడం అనుమానమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొరియన్‌ కనకరాజు పబ్లిసిటీ ముందు డీసీ తేలిపోవడంతో ముందే చేతులు ఎత్తేసినట్లు అయింది. ప్రచారం చేసి ఉంటే డీసీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా మంచి మార్కెట్‌ ఉండేది.

Tags:    

Similar News