హీరోయిన్ డామినేట్ చేస్తుందంటే? హీరోలు సహించలేరా!
సినీ పరిశ్రమలో హీరోల ఆధిపత్యం గురించి? వారు ప్రదర్శించే అభద్రతా భావం గురించి బాలీవుడ్ నటి తాప్సీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.;
సినీ పరిశ్రమలో హీరోల ఆధిపత్యం గురించి? వారు ప్రదర్శించే అభద్రతా భావం గురించి బాలీవుడ్ నటి తాప్సీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తన సినిమాల్లో తన పాత్ర కంటే హీరో పాత్ర తక్కువగా ఉందంటే, నటించడానికి చిన్న హీరోలు కూడా వెనకడుగు వేస్తున్నారని తాప్సీ కుండబద్దలు కొట్టింది. కథ బాగున్నా? కేవలం హీరోయిన్ డామినేట్ చేస్తుందనే భయంతోనే కొంత మంది హీరోలు ప్రాజెక్టులను వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా మంది హీరోలు అభద్రతా భావంతోనే పని చేస్తున్నారని అమ్మడు విమర్శించింది. స్క్రీన్‌పై హీరోయిన్ హైలైట్ అయితే తమ ఇమేజ్ దెబ్బతింటుందని కొంత మంది హీరోలు భావిస్తున్నాంది.
ఒక కథకు ప్రాధాన్యతనిచ్చి, అందులో తన పాత్ర పరిధి ఎంత ఉన్నా? నటించే జెన్యూన్ హీరోలు నేటి కాలంలో కరువయ్యారని పేర్కొంది. కేవలం హీరో సెంట్రిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే ధోరణి మారాలని అమ్మడు డిమాండ్ చేసింది. తాప్సీ గతంలో నటించిన `పింక్`, `తప్పడ్`, `బద్లా` వంటి చిత్రాల్లో ఆమె పాత్రలే కథను నడిపించాయి. ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి అగ్ర హీరోలను పక్కన పెడితే? కనీసం అప్ కమింగ్ హీరోలు కూడా ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంది. హీరోయిన్ పక్కన సెకండ్ లీడ్ గా కనిపిస్తే తమ మార్కెట్ పడిపోతుందనే అపోహలో హీరోలు ఉన్నారని అభిప్రాయపడింది.
`సినిమా అనేది ఒక టీమ్ వర్క్ అని, కథ డిమాండ్ మేరకు ఎవరి పాత్రకైనా ప్రాధాన్యత ఉండవచ్చని హీరోలు గుర్తించడం లేదంది. కేవలం తన పాత్రే గొప్పగా ఉండాలి. హీరోయిన్ పాటలకే పరిమితం కావాలి అనే పాతకాలపు ఆలోచనల నుంచి పరిశ్రమ బయటకు రావాలని కోరింది. జెన్యూన్ గా కథను ప్రేమించే నటులు ఉంటేనే? వైవిధ్య మైన సినిమాలు వస్తాయని అభిప్రాయపడింది. ఇప్పుడీ వ్యాఖ్యలు హీరోల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతాయో చూడాలి. కానీ తాప్సీ వ్యాఖ్యలు పరిశ్రమలోని పురుషాధిక్యతను , హీరోల ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తున్నాయి.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా? బలమైన పాత్రలు చేయాలనుకునే హీరోయిన్లకు హీరోల నుంచి సరైన సహకారం అందలేదన్నది అర్దమవుతుంది. మరి రాబోయే రోజుల్లో అయినా హీరోలు తమ అభద్రతా భావాన్ని వీడి కథా బలమున్న చిత్రాల్లో హీరోయిన్లతో కలిసి సమానంగా నటిస్తారో? లేదో ? చూడాలి. చిత్ర పరిశ్రమలో మేల్ డామినేషన్ అనేది ఉన్నది వాస్తవం. దీనిపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ గళాన్ని వినిపించారు. హీరోలతో సమాన పారితోషికాలు తమకెందుకు ఇవ్వరని గొంతెత్తిన సందర్బాలెన్నో. అలాగే ఆన్ సెట్స లో హీరోతో సమానంగా తమనెందుకు ట్రీట్ చేయరని చాలా మంది నటీమణులు ఓపెన్ అయ్యారు.