సక్సెస్ లేకున్నా.. గ్లామర్ లో ఈ బ్యూటీ హిట్టు

ఎప్పటికప్పుడు ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటున్న బ్యూటీలలో ప్రగ్యా జైస్వాల్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.;

Update: 2024-01-08 09:47 GMT

సినిమా ప్రపంచంలో సక్సెస్ తో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్స్ క్రేజ్ అందుకుంటున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ప్రపంచంలో వారి అందంతో ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటున్న బ్యూటీలలో ప్రగ్యా జైస్వాల్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.


ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో షేర్ చేసిన కూడా అందులో తన గ్లామర్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికే చాలాసార్లు బికినీలో దర్శనం ఇచ్చిన అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. సముద్ర తీరంలో అలా చిన్న షిప్ లో అమ్మడు కలర్ఫుల్ బికినీలో కనిపించిన విధానం కుర్రాళ్ళ మనసును దోచేసింది.


సక్సెస్ లేకపోయినా.. గ్లామర్ లో ఈ బ్యూటీ సూపర్ హిట్ అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ప్రగ్యా సినిమా కెరియర్ అయితే మొదట నుంచి కూడా కాస్త కష్టంగానే కొనసాగుతూ ఉంది. మొదట ఈ బ్యూటీ కొన్ని చిన్న సినిమాల్లో నటించి ఆ తర్వాత కంచె సినిమాతో నటిగా మంచి గుర్తింపున అందుకుంది. అందులో ఆమె గ్లామర్ హడావిడి ఎక్కువగా ఏమీ చేయలేదు.


కేవలం తన పర్ఫామెన్స్ తోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే పలు అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత అమ్మడికి తిరిగి ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు. మంచి నటన గ్లామర్ ఉన్నప్పటికీ కూడా రేంజ్ ను పెంచే స్థాయిలో అయితే పెద్ద సినిమాలు పడటం లేదు.


ఆ మధ్య బాలకృష్ణ అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ పెద్దగా కెరీర్ పై ప్రభావం చూపలేదు. ఇక తర్వాత మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా ఏ స్థాయిలో ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనంతరం అమ్మడికి పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. మరి తన గ్లామర్ తో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News