కాంతార పార్ట్ 3.. కొత్త ప్రొడ్యూసర్ ఎంట్రీ తప్పదా?
కాంతార 3 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న మొదలైంది. ఈసారి సినిమా కంటే నిర్మాత గురించే చర్చ జరుగుతోంది.
కాంతార 3 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న మొదలైంది. ఈసారి సినిమా కంటే నిర్మాత గురించే చర్చ జరుగుతోంది. రిషబ్ శెట్టి- హోంబలే ఫిల్మ్స్ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో.. మూడో పార్టు కోసం కొత్త ప్రొడ్యూసర్ రంగంలోకి దిగుతున్నారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే కాంతార ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా రావడం దాదాపు ఖాయమే. రిషబ్ శెట్టి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాంతార మొదటి సినిమా 2022లో వచ్చింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయం సాధించింది. రిషబ్ శెట్టి యాక్టింగ్, దర్శకత్వంతో పాటు కథ, దైవ విశ్వాసాల నేపథ్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఆ విజయంతో కాంతార ఒక సినిమాగా కాకుండా పెద్ద ఫ్రాంచైజీగా మారింది. ఆ తర్వాత కాంతార: చాప్టర్ 1ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. మొదటి సినిమాతో పోలిస్తే ఈసారి బడ్జెట్ కూడా పెరిగింది. అయినా బాక్సాఫీస్ దగ్గర సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. రిషబ్ శెట్టి కథను మరో స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే కొత్త చర్చ మొదలైంది.
కాంతార మొదటి రెండు సినిమాలను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ మూడో భాగంలో కూడా కొనసాగుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. రిషబ్ శెట్టి మరో నిర్మాణ సంస్థతో కలిసి కాంతార 3 చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చర్చకు ప్రధాన కారణం రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా సిచ్యువేషన్స్. కాంతార యానివర్సరీ సందర్భంగా రిషబ్ శెట్టి సినిమా మోమోరీస్ షేర్ చేసుకున్నారు.
అయితే ఆ పోస్టులో హోంబాలే ఫిల్మ్స్ ప్రస్తావన కనిపించలేదు. అటు హోంబాలే ఫిల్మ్స్ కూడా స్పెషల్ పోస్టు చేసింది. అందులో రిషబ్ శెట్టి ప్రస్తావన లేదు. దీంతో రిషబ్, హోంబలే మధ్య ఇంకా డిఫరెన్సెస్ పెరిగాయా అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. గతంలో కూడా రిషబ్ శెట్టి హోంబలే ఫిల్మ్స్ ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారంటూ వార్తలు వచ్చాయి. అలాగే క్రియేటివ్ డిఫరెన్సెస్, డబ్బు విషయంలో విభేదాలు ఉన్నాయంటూ కొన్ని ఊహాగానాలు వినిపించాయి.
కానీ వాటిపై ఇప్పటి వరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ప్రస్తుతం కాంతార 3కి కొత్త నిర్మాత వస్తున్నారని చెప్పడం కంటే.. కొత్త నిర్మాత వచ్చే అవకాశం ఉందనే చర్చ మాత్రమే నడుస్తోందని చెప్పాలి. మరి కాంతార 3 నిర్మాణం విషయంలో చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. హోంబలే ఫిల్మ్స్ కంటిన్యూ అవుతుందా, లేక కొత్త నిర్మాణ సంస్థ వస్తుందా అనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.