• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ కి జోడిగా కల్పన...

చరణ్ కి జోడిగా కల్పన కన్ఫామ్ అయినట్లేనా?

| రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న RC17 సినిమాలో హీరోయిన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘ఆకాశంలో ఒక తార’తో గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లిని సుకుమార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోయిన్లకు లుక్ టెస్టులు నిర్వహించగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By - Srikanth Kontham
Update: 2026-11-23 08:20 GMT

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో 'రంగస్థలం' సినిమా తర్వాత రాబోతున్న మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. రెగ్యులర్‌ షూటింగ్‌కు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మూడు నాలుగు వారాల్లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై దర్శకుడు సుకుమార్‌ క్లారిటీ ఇవ్వలేదు. మొదటగా ఈ సినిమాలో హిందీ ముద్దుగుమ్మ సారా అర్జున్‌ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. అయితే సారా ఇంతకు ముందు టాలీవుడ్‌లో బాల నటిగా కనిపించింది. అందుకే చరణ్‌కు జోడీగా ఆమె నటిస్తే నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సుకుమార్‌ భావించాడట. అందుకే ఆమె స్థానంలో ఇతర హీరోయిన్స్‌ను సుకుమార్‌ పరిశీలించాడు, ఇంకా పరిశీలిస్తూనే ఉన్నాడట.

RC 17 సినిమాలో హీరోయిన్‌గా...

RC17 కోసం దర్శకుడు సుకుమార్‌ ముగ్గురు నలుగురు హీరోయిన్స్‌కి ఆడిషన్స్‌ పెట్టాడని, లుక్ టెస్ట్‌ చేశాడని తెలుస్తోంది. అందులో ఇద్దరు షార్ట్‌ లిస్ట్‌ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి విషయంలో మొత్తం యూనిట్‌ పాజిటివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కాస్త ఎమోషన్‌ టచ్ ఉంటుంది. అందుకే తెలుగు వచ్చిన అమ్మాయి అయితే ఎమోషన్స్ ని పండించే విషయంలో కచ్చితంగా మెరుగ్గా అనిపించవచ్చు అని సుకుమార్‌ భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమా కోసం తెలుగు మూలాలు ఉన్న అమెరికా సెటిల్‌ అమ్మాయి అయిన సాత్విక వీరవల్లిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈమె ఆకాశంలో ఒక తార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో పాటు సాత్విక వీరవల్లి యాక్టింగ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. రివ్యూవర్స్ దాదాపు అంతా సాత్విక నటన గురించి పాజిటివ్‌ కామెంట్స్ చేశారు.

రామ్‌ చరణ్‌, సాత్విక వీరవల్లి కాంబో...

ఆకాశంలో ఒక తార సినిమా విడుదలకు ముందు నుంచే RC 17 సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి నటించబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే సినిమా ఫలితం తారుమారు అయితే దర్శకుడు సుకుమార్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం ఉందని కొందరు భావించారు. కానీ దుల్కర్ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే సాత్విక వీరవల్లికి సుకుమార్‌ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌ చరణ్‌, సాత్విక వీరవల్లి జోడీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఫోటో షూట్‌, టెస్ట్‌ షూట్ ద్వారా నిర్ణయించే అవకాశౄలు ఉన్నాయి. ఈ సినిమాలో కనుక సాత్విక చాన్స్ దక్కించుకుంటే టాలీవుడ్‌లో ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రామ్‌ చరణ్‌కు ఈమె సరి జోడీగా నిలుస్తుందా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ మూవీ..

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్న RC 17 సినిమా షూటింగ్‌ ప్రారంభంకు అంతా సిద్ధం అయినట్లే అంటున్నారు. సుకుమార్‌ బ్యాక్ టుబ్యాక్‌ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబోకి హిట్‌ కాంబోగా పేరు దక్కింది. అందుకే RC 17 సినిమా విషయంలోనూ ఎలాంటి అనుమానం లేదని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత దర్శకుడు సుకుమార్‌ మొత్తం పుకార్లకు చెక్ పెట్టే విధంగా సాలిడ్‌ అప్‌డేట్‌ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి రామ్‌ చరణ్‌ ఈ సినిమాలోని పాత్ర కోసం మేకోవర్‌ అవుతున్నాడు. హెయిర్ స్టైల్‌ మొదలుకుని బాడీ లాంగ్వేజ్‌ను మార్చడం వరకు అన్నింటి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ చరణ్‌ ముందస్తు వర్కౌట్‌ చేస్తున్నాడు. సుకుమార్‌ ఈ సినిమాలో చరణ్‌ను ఎలా చూపించబోతున్నాడా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • ramcharan 
  • sukumar 
  • rc17 
  • satvikaveeravalli 
  • akasamlookatara 
  • mythrimoviemakers 

Similar News

మతం మారను కానీ గౌరవిస్తా!

2026-11-23 08:18 GMT

ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?

2026-11-23 08:16 GMT

ప్రభుదేవాతో విష్ణు.. ఈసారి పెద్ద ప్లానే!

2026-11-23 08:13 GMT

పాపం సాయి పల్లవి ఎందుకింత టార్గెట్ అవుతుంది?

2026-11-23 08:13 GMT

శర్వానంద్‌పై డైరెక్టర్ సంపత్ నంది ప్రశంసలు.. ఏమన్నారంటే?

2026-11-23 08:12 GMT

భార్యను ఒక్క మాటలో వర్ణించమంటే చై ఏమన్నారంటే?

2026-11-23 08:10 GMT

పాత్రలో జీవించడం కోసం నేర్చుకోవడం తప్పనిసరి!

2026-11-23 08:07 GMT

రూమర్లకు భయపడని బంధం..లైమ్‌లైట్‌కు దూరంగా!

2026-11-23 08:06 GMT

సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్!

2026-11-23 07:04 GMT

హీరోయిన్‌కు సారీ చెప్పిన ‘భోగి’ డైరెక్టర్.. కారణం ఇదే!

2026-11-23 07:03 GMT

చివరి నిమిషం ఆలస్యం ఎంతవరకు కరెక్ట్‌?

2026-11-23 07:02 GMT

Copyright @2026

Powered by Blink CMS