రూమర్లకు భయపడని బంధం..లైమ్‌లైట్‌కు దూరంగా!
| తన జీవితంలో ప్రేమించింది ఒక్క ఆంటోనీ తట్టిల్‌నేనని నటి కీర్తి సురేష్ స్పష్టం చేశారు. గతంలో తనపై వచ్చిన హీరోలు, సంగీత దర్శకులతో సంబంధాల గాసిప్స్‌ను పట్టించుకోలేదని తెలిపారు. ఆంటోనీ ఎప్పుడూ తనను అనుమానించకుండా అండగా నిలిచారని, కెరీర్‌లోనూ ప్రోత్సహించారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సినీ రంగంలో ఎన్నో గాసిప్‌లు.. ఊహాగానాలు సహజమే అయినా? వాటిని తట్టుకుని నిలబడే బలమైన నమ్మకం ఉంటే ఏ బంధమైనా గెలుస్తుందని నటి కీర్తి సురేష్ మాటలు రుజువు చేస్తున్నాయి. పదిహేను ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత 2024లో వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న కీర్తి బంధం గురించి గతంలో వచ్చిన రూమర్ల పై తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తన జీవితంలో ప్రేమించింది ఒక్క ఆంటోనీనేనని.. మరెవరితోనూ ఎలాంటి సంబంధం లేదన్నారు. కెరీర్ ఆరంభంలో తోటి నటులతో.. సంగీత దర్శకులతో తన పేరును ముడిపెడుతూ వచ్చిన వార్తలు అప్పట్లో కొంత బాధ కలిగించేవి అన్నారు.
అలాంటి గాసిప్‌లు వినిపించినప్పుడల్లా ఆంటోనీ ఎప్పుడూ తనను నిలదీయలేదన్నారు. దీనిపై రియాక్ట్ అవ్వాలనుకుంటున్నావా? అని మాత్రమే ఆప్యాయంగా అడిగేవారని కీర్తి గుర్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు.. సందేహాలు లేనప్పుడు బయటి వారికి ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదనిపించేదన్నారు. అందుకే పుకార్లను పట్టించుకోకుండా వాటికి సమాధానాలు చెప్పి సమయం వృథా చేసుకోకూడదని నిర్ణయిం చుకున్నట్లు తెలిపారు.
ప్రేమలో ఉన్నన్ని రోజులూ బంధాన్ని రహస్యంగా ఉంచడం పెద్ద కష్టంగా అనిపించలేదని కీర్తి వివరించారు. ఇద్దరం కలిసి ఒంటరిగా ట్రిప్‌లకు వెళ్లేవారం కాదని స్నేహితుల బృందంతో కలిసి తిరిగేవారమని.. అందుకే ఫోటోలు పోస్ట్ చేసినా ఎవరికీ అనుమానం వచ్చేది కాదన్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించడం, భిన్న మతాలకు చెందిన ఇద్దరి పెళ్లి విషయంలో కొన్ని సవాళ్లు ఎదురైనా? ఆంటోనీ తనను సినిమాల్లోకి రాకముందు నుంచే చూశారని ఇద్దరం కలిసి ఎదిగామని కీర్తి ఎమోషనల్ అయ్యారు.
లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికే ఆంటోనీ ఇష్టపడతారని.. అందుకే తన సినిమాల ప్రీమియర్లకు లేదా బహిరంగ కార్యక్రమాలకు ఆయన సాధారణంగా రారు అన్నారు. తన పక్కన నిలబడటం కంటే? ఆయనకు సౌకర్యంగా.. ప్రశాం తంగా ఉండటమే ముఖ్యమన్నారు. అలాగే కెరీర్‌లో డౌట్‌లు వచ్చినప్పుడు అండగా నిలబడటమే కాకుండా `డోరతీ` లాంటి చిత్రంలో నటించమని ప్రోత్సహించింది ఆంటోనీనేనని వెల్లడించారు.
ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే అమ్మడు పుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది. ఎలాంటి అవకాశాఉ వచ్చినా? నో చెప్పకుండా కమిట్ అవుతుంది. ఇలా చేయడంతో కీర్తి షెడ్యూల్ మరింత బిజీ అయింది. అలాగని పారితోషికంలో ఎలాంటి మినహాయింపులు లేవు. కీలక పాత్ర కు సైతం హీరోయిన్ స్థాయికి సమానంగా పారితోషికం అందుకుంటుంది.