• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాపం సాయి పల్లవి ఎందుకింత...

పాపం సాయి పల్లవి ఎందుకింత టార్గెట్ అవుతుంది?

| ‘రామాయణ’లో సీతగా సాయి పల్లవి నటనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జటాయువు రావణుడితో పోరాడి ప్రాణాలు విడిచే సన్నివేశంలో ఆమె హావభావాలు సహజంగా లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సీతగా నటించిన కృతి సనన్‌తో పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

By - Ramesh Palla
Update: 2026-11-23 08:13 GMT

రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీత పాత్రలో నటించిన ‘రామాయణ’ మూవీ ఇటీవల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ ఓపెనింగ్ దక్కింది. మొదటి వారం రోజుల జోరు చూసి అంతా షాక్ అయ్యారు. వెయ్యి కోట్ల వసూళ్లను చాలా సింపుల్‌గా క్రాస్ చేసిన రామాయణ మూవీ లాంగ్‌ రన్‌లో రూ.2000 కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. చైనాతో పాటు ఇతర విదేశీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు అక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తే మరో వెయ్యి కోట్లు అదనంగా వచ్చిన ఆశ్చర్యం లేదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సూర్పనక పాత్రలో రకుల్‌ నటించగా, మండోదరి పాత్రను కాజల్‌ అగర్వాల్‌ చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు సీత పాత్ర చేసి ఉంటే బాగుండేదని, సాయి పల్లవి ఎంపిక ఏమాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సీతాదేవి పాత్రలో సాయి పల్లవి...

సీత పాత్రలో సాయి పల్లవిని ప్రేక్షకులు మొదటి నుంచి ఊహించుకోలేక పోయారు. సినిమా విడుదల తర్వాత సీత దేవిగా సాయి పల్లవి ఆకట్టుకోలేకపోయారు. సినిమాలో సాయి పల్లవి మాత్రమే కనిపించిందని, సీత కనిపించలేదని కొందరు రివ్యూవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె యాక్టింగ్‌ విషయంలోనూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీతాపహరణం సన్నివేశంలో సాయి పల్లవి యాక్టింగ్‌ మరీ నార్మల్‌గా ఉందని, మినిమం ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వలేక పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. సీత పాత్రలో సాయి పల్లవి నటించింది, అంటే తనను కాపాడేందుకు ప్రాణాలు సైతం లక్ష్యపెట్టకుండా రావణుడితో పోరాటం చేస్తున్న జటాయువు చూసి సాయి పల్లవి కనీసం అయ్యో అని కూడా అనకుండా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా ఉంది. అంతకు ముందు వచ్చిన చాలా రామాయణ సినిమాలతో పోల్చితే ఈ సినిమాలోని సీత యాక్టింగ్‌ మరీ పూర్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రామాయణంలో జటాయువు...

జటాయువు ప్రాణాలు వదిలి కింద కూలుతున్న సమయంలోనూ సీత పాత్రలో నటించిన సాయి పల్లవి ఒకే తరహా ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉంది. ఆమె యాక్టింగ్‌ ఏమాత్రం ఆకట్టుకోలేదు అని అంతా అంటున్నారు. ఆ సమయంలో సాయి పల్లవి యాక్టింగ్‌కు చాలా స్కోప్ ఉంది. ఈ సమయంలో ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమాలో జటాయువు చనిపోయిన సమయంలో సీత పాత్రలో నటించిన కృతి సనన్‌ యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని అంటున్నారు. మొత్తంగా చాలా రామాయణ సినిమాల్లోని జటాయువు, రావణుడి యుద్ధ సన్నివేశాలు తీసుకు వచ్చి సీత పాత్రలో నటించిన వారి యాక్టింగ్‌తో పోల్చుతున్నారు. ఏ ఒక్కరి యాక్టింగ్‌తో పోల్చినా సాయి పల్లవి యాక్టింగ్‌ బాగుంది అని మాత్రం అనిపించడం లేదని సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి ఈ విషయంలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ...

దర్శకుడు నితీష్ తివారీ ఈ సీన్‌ లో సాయి పల్లవితో యాక్టింగ్‌ చేయించడంలో విఫలం అయ్యాడా లేదంటే ఆమెకు ఎంత చెప్పినా అంతే యాక్టింగ్‌ చేసిందా అనేది మాత్రం ఆయనే చెప్పాలి. జటాయువు కుప్పకూలుతున్న సమయంలో గుండెలు పగిలిపోయేలా ఎమోషన్‌ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సాయి పల్లవి మాత్రం ఒక నార్మల్‌ సీన్‌ లో నటించినట్లుగానే ఆ సీన్‌లోనూ నటించింది. అందుకే సాయి పల్లవిని చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అయితే కచ్చితంగా ఈ ట్రోల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వీడియోను పెట్టి మరీ చాలా మంది ట్రోల్‌ చేస్తారు. రామాయణ సినిమాలు అన్నింటిలోంచి ఆ జటాయువుకు సంబంధించిన సీన్స్ పక్కన పక్కన పెట్టి సాయి పల్లవి యాక్టింగ్‌ గురించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. సాయి పల్లవి రామాయణ మూవీ కన్ఫర్మ్‌ అయినప్పటి నుంచి ఏదో ఒక తరహాలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి విమర్శలను సాయి పల్లవి ఎదుర్కొన్న దాఖలాలు లేవు. అందుకే ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • saipallavi 
  • ramayana 
  • ranbirkapoor 
  • kritisanon 

Similar News

చరణ్ కి జోడిగా కల్పన కన్ఫామ్ అయినట్లేనా?

2026-11-23 08:20 GMT

మతం మారను కానీ గౌరవిస్తా!

2026-11-23 08:18 GMT

ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?

2026-11-23 08:16 GMT

ప్రభుదేవాతో విష్ణు.. ఈసారి పెద్ద ప్లానే!

2026-11-23 08:13 GMT

శర్వానంద్‌పై డైరెక్టర్ సంపత్ నంది ప్రశంసలు.. ఏమన్నారంటే?

2026-11-23 08:12 GMT

భార్యను ఒక్క మాటలో వర్ణించమంటే చై ఏమన్నారంటే?

2026-11-23 08:10 GMT

పాత్రలో జీవించడం కోసం నేర్చుకోవడం తప్పనిసరి!

2026-11-23 08:07 GMT

రూమర్లకు భయపడని బంధం..లైమ్‌లైట్‌కు దూరంగా!

2026-11-23 08:06 GMT

సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్!

2026-11-23 07:04 GMT

హీరోయిన్‌కు సారీ చెప్పిన ‘భోగి’ డైరెక్టర్.. కారణం ఇదే!

2026-11-23 07:03 GMT

చివరి నిమిషం ఆలస్యం ఎంతవరకు కరెక్ట్‌?

2026-11-23 07:02 GMT

Copyright @2026

Powered by Blink CMS