• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కిరణ్ అబ్బవరం నుంచి మరో...

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

| ‘క’ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, తన 14వ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ‘రికార్డ్’ పేరుతో ప్రారంభించారు. ‘పుష్ప’ టీమ్‌లో పనిచేసిన వీర కోగటం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌పై ఆసక్తి పెంచుతోంది. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.

By - Madhu Reddy
Update: 2026-11-23 09:20 GMT

టాలీవుడ్ లో క’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన రూట్ పూర్తిగా మార్చేశాడు. రొటీన్ లవ్ స్టోరీలకు బదులు కొత్త కాన్సెప్ట్‌లనే నమ్ముకుంటున్న కిరణ్, తన 14వ సినిమాను ఏకంగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ‘రికార్డ్’ అనే టైటిల్‌తో స్టార్ట్ చేశాడు. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటేనే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలేంటో చూద్దాం.

సుకుమార్ శిష్యుడితో కిరణ్ కొత్త ప్రయోగం:

సాధారణంగా సుకుమార్ శిష్యుల సినిమాలంటేనే కథలో ఏదో ఒక ట్విస్ట్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉంటాయి. ‘ఉప్పెన’, ‘విరూపాక్ష’ లాంటి హిట్ల తర్వాత ఇప్పుడు ‘పుష్ప’ టీమ్‌లో పనిచేసిన వీర కోగటం ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతున్నాడు. కిరణ్ అబ్బవరం కూడా ‘క’ సినిమా తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. సుకుమార్ బ్యానర్ తోడవడంతో ఈ కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది.

పోస్టర్ చెబుతున్న రహస్య కథేంటి?:

రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఎవరికైనా క్యూరియాసిటీ పెరగడం ఖాయం. ఎర్రటి చంద్రుడు, వెనుక గంటలు కట్టిన జంతువు తల, కోడిపుంజు ఈకలు,గంటలు, గుర్రం.. ఇవన్నీ చూస్తుంటే ఏదో పల్లెటూరి మూఢనమ్మకాలు లేదా రహస్య ఆచారాల చుట్టూ ఈ కథ తిరుగుతుందనిపిస్తోంది. పైగా పోస్టర్ మొత్తాన్ని వీడియో కెమెరా రికార్డింగ్ స్క్రీన్ లాగా డిజైన్ చేయడం, "కొన్ని కథలు చెబుతారు.. మరికొన్ని రికార్డ్ అవుతాయి" అనే లైన్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.

హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్:

ఈ సినిమా పూజా కార్యక్రమానికి దిల్ రాజు, సుకుమార్, బన్నీ వాస్ లాంటి పెద్ద వాళ్లంతా రావడం విశేషం. కిరణ్ అబ్బవరంకు ‘క’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన నిర్మాత వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒకవైపు తనే డైరెక్ట్ చేసిన ‘రియాలిటీ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగానే, ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్‌ను లైన్లో పెట్టడం కిరణ్ ప్లానింగ్‌ను చూపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొడుతుందా?:

ఇప్పటివరకు చూసిన కిరణ్ అబ్బవరం వేరు, ఇప్పుడు ఎంచుకుంటున్న కథలు వేరు. సుకుమార్ మార్క్ సస్పెన్స్, వీర కోగటం మేకింగ్, కిరణ్ కొత్త లుక్ అన్నీ కలిస్తే ‘రికార్డ్’ నిజంగానే బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు రాసేలా ఉంది. మరి ఈ రహస్య ప్రపంచం ప్రేక్షకులను ఏ రేంజ్‌లో థ్రిల్ చేస్తుందో చూడాలి.

Tags:    
  • kiranabbavaram 
  • recordmovie 
  • sukumarwritings 
  • veerakogatum 

Similar News

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

నువ్వు కాదు.. నేను పని మాట్లాడాలి: భీమ్స్!

2026-11-23 09:19 GMT

చరణ్ కి జోడిగా కల్పన కన్ఫామ్ అయినట్లేనా?

2026-11-23 08:20 GMT

మతం మారను కానీ గౌరవిస్తా!

2026-11-23 08:18 GMT

ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?

2026-11-23 08:16 GMT

ప్రభుదేవాతో విష్ణు.. ఈసారి పెద్ద ప్లానే!

2026-11-23 08:13 GMT

పాపం సాయి పల్లవి ఎందుకింత టార్గెట్ అవుతుంది?

2026-11-23 08:13 GMT

శర్వానంద్‌పై డైరెక్టర్ సంపత్ నంది ప్రశంసలు.. ఏమన్నారంటే?

2026-11-23 08:12 GMT

భార్యను ఒక్క మాటలో వర్ణించమంటే చై ఏమన్నారంటే?

2026-11-23 08:10 GMT

పాత్రలో జీవించడం కోసం నేర్చుకోవడం తప్పనిసరి!

2026-11-23 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS