మృణాల్ ఠాకూర్ భోజుపురికీ వెళ్తుందా?
నాటి నుంచి గ్లామర్ షోల కంటే నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న భామ దక్షిణాదిలోనే గాక ఉత్తరాదిలోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది
మృణాల్ ఠాకూర్ అంటే `సీతారామం` చిత్రంలోని సీత పాత్రే కళ్ల ముందుకొస్తుంది. నాటి నుంచి గ్లామర్ షోల కంటే నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న భామ దక్షిణాదిలోనే గాక ఉత్తరాదిలోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ త్వరలోనే భోజ్‌పురి చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతోందంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
భోజ్‌పురి నటుడు, లోక్‌సభ సభ్యుడు అయిన రవికిషన్‌తో కలిసి మృణాల్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయిందనేది ఆ వార్తల సారాంశం. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ చిత్రాలైన `బట్లా హౌస్`, `సన్ ఆఫ్ సర్దార్ 2` లలో ముఖ్య పాత్రలలో కలిసి నటించారు. ఆ పరిచయంతోనే ఓ బలమైన భోజ్‌పురి కథకు మృణాల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి రవికిషన్ ఆఫర్ చేశారని.. దానికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసిందనే ప్రచారం సినీ వర్గాల్లో ఊపందుకుంది.
సినిమాల ఎంపిక విషయానికి వస్తే మృణాల్ సిద్ధాంతాలు చాలా స్పష్టం. కోట్ల పారితోషికాలు ఆఫర్ చేసినా? గ్లామర్ బొమ్మగా మిగిలిపోయే పాత్రలను అమ్మడు ఏనాడూ అంగీకరించలేదు. పారితోషికం తక్కువ అయినా? నటనకు ఆస్కారం ఉండి ప్రేక్షకుల గుర్తుండిపోయే పాత్రలకే అమ్మడు ప్రాధాన్యత ఇస్తుంటారు. `సీతారామం` తర్వాత అనేక కమర్షియల్ అవకాశాలు తలుపు తట్టినా? స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో రాజీ పడకుండా కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలనే ఎంచుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే హిందీ, మరాఠీ, తెలుగు వంటి విభిన్న భాషల్లో నటనతో పదునైన ముద్ర వేసిన మృణాల్ ఇప్పుడు భోజ్‌పురి ప్రాంతీయ సినిమా వైపు దృష్టి పెట్టడం వెనుక బలమైన కథే ఉంటుందని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా భోజ్‌పురి సినిమాలంటే మాస్, గ్లామర్ కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారనే టాక్ ఉంది. కానీ మృణాల్ లాంటి సహజ నటి అక్కడ అడుగుపెడుతోందంటే? ఖచ్చితంగా అదొక డిఫరెంట్ పవర్ ఫుల్ కాన్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మృణాల్ ఠాకూర్ కానీ, రవికిషన్ టీమ్ కానీ ఈ వార్తలను ధ్రువీకరించాల్సి ఉంది. ఇవన్నీ రూమర్లా లేక నిజంగానే క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం భోజ్‌పురి సినీ రంగానికి ఓ సరికొత్త గ్లామర్ అండ్ కంటెంట్ ల్యాండ్‌మార్క్‌గా మారే అవకాశం ఉంది.