టాక్సిక్ బ్యూటీ క్లాసీ రాజస్థానీ వైబ్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ యూత్‌ను, ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది.
బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ యూత్‌ను, ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రాజస్థానీ వైబ్స్‌ను క్రియేట్ చేసే కొత్త లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజస్థానీ క్లాసిక్ లుక్‌కు తారా మాత్రమే సరిగ్గా సరిపోతుందనేలా ఈ ఫోటోషూట్‌లో అద్భుతంగా కనిపిస్తోంది. ట్రెడిషనల్ - కంటెంపరరీ స్టైలింగ్‌ను మిళితం చేస్తూ తారా ఇచ్చిన ఈ పోజులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అంతర్జాతీయ డిజైన్ లేబుల్స్.. ప్రముఖ బ్రాండ్స్ అయిన `హోలిచిక్ బై మేఘా`, `ఫ్యాషనేట్లీ పెర్నియా` సహకారంతో రూపొందిన ఈ లుక్‌లో తారా అచ్చం రాజస్థానీ రాకుమారిలా మెరిసిపోయారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ బ్యూటీ ప్రదర్శించే గ్రేస్, ఎలిగెన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ తాజా ఫోటోషూట్‌కు అభిమానుల నుండి, ప్రముఖ డిజైనర్ల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ ఫోటోలు షేర్ అవుతూ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఇదిలా ఉంటే.. కేవలం తన అందం - ఫ్యాషన్‌తోనే కాకుండా తారా సుతారియా తన ఆలోచనా విధానం, లైఫ్ స్టైల్ -వ్యక్తిగత విషయాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పెర్నియా ఖురేషితో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మర్యాదలు .. జీవన శైలి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లి ఒక ఎటికెట్ కోచ్ కావడంతో చిన్నతనం నుంచే తన నేర్పిన జీవన విలువలను తారా ఎంతో స్పష్టంగా వివరించారు.
మర్యాదలు అనగా కేవలం కొన్ని కఠినమైన నియమాలను గుడ్డిగా పాటించడం కాదని.. ఎదుటివారిపై ఆలోచనాత్మకంగా ప్రవర్తించడమే అసలైన మర్యాద అని తారా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతరుల ఎదురుగా కూర్చునేటప్పుడు పాదాలు మరొకరి వైపు చూసేలా లేదా వారిని తాకేలా ఉండకూడదని.. భోజన సమయాల్లో మోచేతులను డైనింగ్ టేబుల్‌పై ఉంచకూడదని కొన్ని సున్నితమైన విషయాలను గుర్తుచేశారు.
అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వల్ల మనం వారిపై చూపుతున్న శ్రద్ధ తెలుస్తుందనిపేర్కొన్నారు. ఒకరిని పలకరించేటప్పుడు స్పర్శ సున్నితంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉండాలని వివరించారు. ఈ విధంగా ఫ్యాషన్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంటూనే.. మరోవైపు సంస్కృతి, మంచి అలవాట్లపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల తారా సుతారియా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.