లోలోపల ఏడవాలనిపించినా పైకి కన్నీళ్లు రావు.. చైతూ ఆవేదన!
| నాగచైతన్య తన వ్యక్తిగత భావోద్వేగాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏడవాలని ఉంటుంది కానీ ఏడుపు రాదు’’ అంటూ తన మనసులోని బాధను పంచుకున్నారు. ఇంటర్నెట్‌లో ఏ వార్తా శాశ్వతం కాదని, ఒక వార్తను మరోటి భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతోంది.
అక్కినేని నాగచైతన్య నటించిన `వృషకర్మ` డిసెంబర్ లో అత్యంత భారీగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ బిజీ బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత భావోద్వేగాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ .. తన మౌనంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ``ఎప్పుడైనా ఏడ్చావా బ్రో?`` అని అడిగిన ప్రశ్నకు చైతన్య ఎంతో నిజాయితీగా స్పందిస్తూ.. ``ఏడవాలని ఉంటుంది కానీ.. ఏడుపు రాదు`` అని సమాధానమిచ్చారు. తన మనసులోని బాధను, భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తనకు అంత సులభం కాదని... లోలోపల ఎంత వేదన ఉన్నా పైకి కన్నీళ్లు రావని అతడు పేర్కొన్నారు.
అంతేకాకుండా తన నిశ్శబ్దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో జరిగే చర్చలపై స్పందిస్తూ.. ``ఇంటర్నెట్‌లో ఏదీ శాశ్వతం కాదు.. ఒక వార్తను మరో వార్త భర్తీ చేస్తుంది`` అంటూ ఎంతో పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
బయట తన గురించి ఎన్ని వార్తలు షికార్ చేసినా.. విమర్శలు వచ్చినా తాను ఎందుకు స్పందించడో వివరిస్తూ.. ``ఇంటర్నెట్‌లో ఏదీ శాశ్వతం కాదు.. ఒక వార్తను మరో వార్త భర్తీ చేస్తుంది`` అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇవాళ ఉన్న వార్త స్థానంలోకి రేపు మరో కొత్త వార్త వస్తూనే ఉంటుందని.. అందుకే తాను నెగటివిటీని పెద్దగా పట్టించుకోనని నాగచైతన్య తన లైఫ్ ఫిలాసఫీని స్పష్టం చేశారు.
తన నిశ్శబ్దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. కొన్ని సందర్భాల్లో లోలోపల ఎంతో బాధగా ఉండి ఏడవాలని అనిపించినా పైకి కన్నీళ్లు రావని చై ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. నవంబర్ 23న 40వ ఏట అడుగుపెట్టిన చైతూ... ఇప్పుడు జీవితాన్ని చూసే తన కోణం మరింత మారిందని తెలిపారు.
అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం `వృషకర్మ` డిసెంబర్ 4 న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యూట్యూబర్ తో కలిసి రామగిరి కోట- అడ్వెంచర్ ట్రిప్ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య ఈ విషయాలన్నిటినీ షేర్ చేసారు. వృషకర్మ ప్రమోషన్స్ కోసం చైతన్య శ్రమిస్తున్న తీరు చూస్తుంటే.. ఈ సినిమాతో అతడు మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంత కసిగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.