• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భోగి వెనుక సంపత్ నంది...

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

| దర్శకుడు సంపత్ నంది చిన్నప్పుడు చూసిన ఓ వ్యక్తి సంఘటన ఆధారంగా ‘భోగి’ కథను రూపొందించినట్లు వెల్లడించారు. 1960ల తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో గ్రామం సెట్ వేశారు. శర్వానంద్ గంగ పాత్ర కోసం బరువు తగ్గి, పలు లుక్ టెస్టులు చేశారు. రక్తపాతం ఎక్కువగా ఉండటంతో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లిందని, కొన్ని మ్యూట్స్ మాత్రమే సూచించారని సంపత్ తెలిపారు. నవంబర్ 27న ‘భోగి’ విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-24 18:18 GMT

శర్వానంద్‌తో సంపత్ నంది తీసిన భోగి ట్రైలర్‌లో యాక్షన్, రక్తపాతం బాగానే చూపించారు. అయితే ఈ కథకు బీజం ఎక్కడ పడిందో తెలిస్తే కాస్త ఆశ్చర్యం కలగకమానదు. సంపత్ చిన్నప్పుడు తమ ఊరికి దగ్గరలోని రామగిరి గుట్ట వద్ద ఓ వ్యక్తిని చూసి భయపడేవారట. మూఢ శక్తుల కోసం ఏవో పూజలు చేసేవాడని ఆ వ్యక్తి గురించి చెప్పుకునేవారట. ఆ సంఘటనను చాలా ఏళ్ల తర్వాత సినిమా కథగా మార్చుకున్నట్లు సంపత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహారాష్ట్ర బోర్డర్‌లో జరిగిన మరో సంఘటన గురించి పేపర్ కటింగ్ రావడంతో కథకు మరింత మెటీరియల్ దొరికిందట.

ఈ రెండు సంఘటనలను కలిపి బొగ్గుల గుట్ట అనే ఊరిని సృష్టించారు. 1960ల తెలంగాణ నేపథ్యంలో అక్కడి మనుషులు, నమ్మకాలు, కట్టుబాట్లతో కథను నడిపించారు. ఇందుకోసం ఏకంగా 15 ఎకరాల్లో విలేజ్ సెట్ వేశారు. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారట. అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు పెరిగినా నిర్మాత కేకే రాధామోహన్ వెనక్కి తగ్గలేదని సంపత్ చెప్పారు. అప్పటి తెలంగాణ యాసలో ఉర్దూ పదాల ప్రభావం తక్కువగా ఉండేదని, అదే తరహా డైలాగ్స్ రాయడానికి ప్రయత్నించామని వివరించారు.

ఇక శర్వానంద్ గంగ పాత్ర కోసం బాగానే మారాల్సి వచ్చిందట. కథను 15 నిమిషాలు వినగానే శర్వా ఓకే చెప్పారని సంపత్ తెలిపారు. కానీ గెటప్ ఫైనల్ కావడానికి రెండు నెలలు పట్టిందట. అప్పటి పల్లెటూరి మనుషుల మాదిరిగా కనిపించేందుకు శర్వా బరువు తగ్గారు. మీసాలు, గడ్డంతో నాలుగైదు లుక్ టెస్టులు చేశారట. తెలంగాణ యాస కూడా బాగా మాట్లాడారని సంపత్ మెచ్చుకున్నారు. ముఖ్యంగా క్లోజప్ షాట్స్‌లో శర్వా పెర్ఫార్మెన్స్ డైనమైట్‌లా ఉందని, ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పారు.

భోగి సెన్సార్ ఆలస్యానికి కారణం కూడా సంపత్ వివరించారు. సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉండటంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చిందట. అయితే ఒక్క సీన్ కూడా తొలగించలేదని, కొన్ని మ్యూట్స్ మాత్రమే సూచించారని చెప్పారు. కథలో మూఢనమ్మకాల అంశం ఉందని తెలిపారు. గాంజా శంకర్ కథనే భోగిగా మార్చారనే ప్రచారాన్ని కూడా ఖండించారు. అది క్రైమ్ కథ అయితే ఇది అన్నాచెల్లెళ్ల ఎమోషన్‌తో సాగే సినిమా అని తేడా చెప్పారు.

సంపత్ గత సినిమాల్లో కనిపించే కమర్షియల్ ఫార్ములాకు ఈసారి కొన్ని మార్పులు చేశారట. కథకు అడ్డొస్తుందని ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా వద్దనుకున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి పాత్రల్లో మంచి లవ్ ట్రాక్ ఉంటుందని చెప్పారు. అనుపమ స్వయంగా డబ్బింగ్ చెప్పారట. భీమ్స్ సంగీతంపై సంతృప్తి వ్యక్తం చేసిన సంపత్, చంద్రబోస్ అన్ని పాటలు రాశారని తెలిపారు. కథ కోసం చంద్రబోస్ లొకేషన్లకు కూడా వచ్చేవారట.

మరోవైపు భోగి టైటిల్‌కు సంక్రాంతి పండగతో సంబంధం లేదని సంపత్ చెప్పారు. ఊరిలో పాతుకుపోయిన తప్పుడు నమ్మకాలను ఎదుర్కొనే కథకు ఆ పేరు పెట్టారట. సినిమా చూసిన శర్వానంద్ తనను అభినందించారని తెలిపారు. ఇప్పటివరకు చేయని రఫ్ యాక్షన్ పాత్రలో శర్వాను చూపిస్తున్నామని, వయలెన్స్ ఉన్నా అందరూ చూడగలిగేలా తీశామని చెప్పారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం సంపత్ తన రెగ్యులర్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకున్నట్లు వివరించారు.

Tags:    
  • bhogi 
  • sharwanand 
  • sampathnandi 
  • bhogimovie 
  • anupamaparameswaran 

Similar News

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS