• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ప్లానెట్ ఆఫ్ ది...

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

| ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’తో ‘రివెంజ్ ఆఫ్ నాగదేవతాస్’ను పోలుస్తూ ఓ సినీ ప్రముఖుడు చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేయడం సరికాదని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సాంకేతిక ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-11-24 18:21 GMT

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక సినీ ప్రముఖుడి వివాదాస్పద-సెటైరికల్ వ్యాఖ్యలు.. దానికి నెటిజన్ల నుంచి వస్తున్న కౌంటర్లు తెగ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ చిత్రం `ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` పేరుతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు కానీ, అదే మన నేటివిటీతో `రివెంజ్ ఆఫ్ నాగదేవతాస్` అంటే చూడరా? అంటూ సదరు వ్యక్తి ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌గా మారింది. అంతేకాదు, ``నువ్వు ఎన్ని షర్ట్స్ మార్చినా పగ మాత్రం మారదు.. కాటేస్తా!`` అనే డైలాగ్‌ సినిమాలో పెడితే 100 రోజులు ఆడుతుందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ అభిమానులు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల పేర్లతో పోలుస్తూ తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారని.. వారికి ఏ సినిమాపైనా వ్యక్తిగత కక్ష ఉండదని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతో.. ప్రేక్షకులను త‌గ్గించి చూస్తూ సినిమాలు తీయడం వల్లే ఆదరణ తగ్గుతోందని విశ్లేషిస్తున్నారు. సినిమా హిట్ అయితే `ప్రేక్షక దేవుళ్లు` అని పొగడటం.. అదే సినిమా ఆడకపోతే ప్రేక్షకుల అభిరుచిని తప్పుబట్టడం సినీ వర్గాల్లో కొందరికి అలవాటుగా మారిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రాన్ని ఒక అద్భుత‌మైన స్క్రీన్ ప్లే, భారీత‌నం నిండిన ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుతో హాలీవుడ్ లో తెర‌కెక్కించారు. ఆ సినిమా క‌థ, క‌థ‌నం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, రీరికార్డింగ్, విజువ‌ల్ సెన్స్, లాజిక్స్ ఇలా అన్ని కోణాల్లో అంత‌ర్జాతీయ స్టాండార్డ్స్ ని ప్ర‌తిబింబించింది. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. అలా కాకుండా త‌లా తోకా లేని క‌థ‌నాల‌తో రూపొందించే లోక‌ల్ సినిమాల‌కు ప్ర‌జాద‌ర‌ణ కావాల‌ని అడిగితే ఎలా ఉంటుంది. సినిమా పిచ్చితో ఏదో ఒక నాశిర‌కం సినిమా తీసేస్తే దానిని చూడ‌టానికి ఇప్పుడు ఎవ‌రూ సిద్ధంగా లేరు. ప్ర‌మాణాలు పెద్ద స్థాయిలో ఉంటేనే ఆద‌రిస్తున్నారు! రివెంజ్ ఆఫ్ ది నాగ‌దేవ‌తాస్.. క‌థ‌, క‌థ‌నం, ఆర్.ఆర్ స్టాండార్డ్స్.. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం ఇవ‌న్నీ ఆ రేంజులో ఉంటేనే వ‌ర్క‌వుట్ అవుతుంది.


#ENERepeat సినిమాలోని సీన్‌ను రీక్రియేట్ చేసిన నటుడు ఏకరాజు! #ENE2 #TharunBhascker #VishwakSen #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/DLxsmx9tdL

— Tupaki (@tupaki_official) November 24, 2026


Tags:    
  • telugucinema 
  • planetoftheapes 
  • revengeofnagadevatas 
  • filmcontroversy 
  • ENE2 
  • tollywood 

Similar News

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS