• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ మూడు టేబుల్స్‌లో...

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

| సినిమా విజయానికి రైటింగ్, ఎడిటింగ్‌తో పాటు లాభాలు కూడా ముఖ్యమని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. సినిమా నిర్మాణం మూడు కీలకమైన టేబుల్స్‌పై ఆధారపడి ఉంటుందని, అవి రైటింగ్, ఎడిటింగ్, ప్రాఫిట్ టేబుల్స్ అని వివరించారు. ఆర్థిక విజయం సాధించినప్పుడే తదుపరి ప్రాజెక్టులకు మార్గం సుగమమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటి గట్టు’లో నటిస్తున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-11-24 18:19 GMT

ఈరోజుల్లో సినిమాలో న‌టించ‌డ‌మే కాదు, మార్కెట్ నాలెజ్ కూడా చాలా ముఖ్యం. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇలాంటి విష‌యాలలో చాలా ముందు చూపుతో ఉంటారు. త‌న నిర్మాత న‌ష్ట‌పోకుండా టేబుల్ ప్రాఫిట్ గురించి చాలా తెలివిగా, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఆలోచిస్తారు. ఎంచుకునే స్క్రిప్టు, కాన్సెప్టును బిజినెస్ కోణంలో కూడా ఆలోచించి ఓకే చెబుతారు. తాజాగా అత‌డి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో త‌న మాట‌ల్లోనే బ‌య‌ట‌ప‌డ్డాయి.

సినిమా నిర్మాణం, వ్యాపార కోణాలపై సాయిధ‌ర‌మ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక సినిమా అనేది కేవలం షూటింగ్‌తోనే పూర్తయిపోదని.. అది ప్రధానంగా మూడు కీలకమైన `టేబుల్స్` మీదే రూపుదిద్దుకుంటుందని సాయిధ‌ర‌మ్ తేజ్ అభిప్రాయపడ్డారు. వాటిలో మొదటిది రైటింగ్ టేబుల్ కాగా.. రెండోది ఎడిట్ టేబుల్.. మూడోది ప్రాఫిట్ టేబుల్ అని సాయి ధరమ్ తేజ్ విశ్లేషించారు.

కథా రచన, ఎడిటింగ్ ఎంత ముఖ్యమో.. సినిమాకు వచ్చే లాభం కూడా అంతే కీలకమని సాయి ధరమ్ తేజ్ నొక్కి చెప్పారు. `ప్రాఫిట్ టేబుల్` అనేది ఎంతో ముఖ్యమైనదని.. అదే నెక్ట్స్‌ ప్రాజెక్టులకు లేదా ఇతర టేబుల్స్ వైపు దారి చూపిస్తుందని పేర్కొన్నారు. క్రియేటివిటీతో పాటు ఆర్థిక విజయం కూడా తోడైనప్పుడే ఇండస్ట్రీలో ముందుకు సాగేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు.

రైటింగ్ - ఎడిట్- ప్రాఫిట్ అనే ఈ మూడు టేబుల్స్ సమన్వయంతో పనిచేసినప్పుడే ఒక సినిమా ప్రయాణం సంపూర్ణమవుతుందనే సాయి ధరమ్ తేజ్ మాటలు... సినిమాను కళాత్మక కోణంతో పాటు ఒక బిజినెస్ కోణంలోనూ చూసే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న `సంబ‌రాల ఏటి గ‌ట్టు` చిత్రం త‌న విశ్లేష‌ణ ప్ర‌కారం.. లెక్క‌ల‌న్నిటినీ స‌రి చేస్తుంద‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ ప్రాజెక్టును ఒక ప్రాఫిట‌బుల్ వెంచ‌ర్ గా మార్చేందుకు ఇంత‌గా శ్ర‌మిస్తున్నార‌ని అంతా భావిస్తున్నారు.

Tags:    
  • saidharamtej 
  • sambaraalayetigattu 
  • megahero 
  • telugucinema 
  • tollywood 

Similar News

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS