• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగులో డిటెక్టివ్ కథలతో...

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

| తెలుగులో కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుండటంతో డిటెక్టివ్ థ్రిల్లర్ జానర్ వెనుకబడుతోంది. 2019లో వచ్చిన నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయాన్ని అందించినా, ఆ తర్వాత అలాంటి ఆసక్తికరమైన సినిమా రాలేదు. యంగ్ హీరోలు ఈ జానర్‌పై దృష్టి పెడితే కొత్త కథలకు ఆదరణ దక్కే అవకాశం ఉంది.

By - Gopi Velupala
Update: 2026-11-25 04:04 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్ని జానర్ సినిమాలకు మాత్రమే పరిమితమవుతుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకే ఇక్కడ ఎక్కువ ఆదరణ దక్కుతుంది. అందుకే అందరు మాస్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇతర భాషల్లో డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నప్పటికి తెలుగులో మాత్రం ఆ జానర్ సినిమాలు చేయడం లేదు. నిజానికి పోలీసులు సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం ను డిటెక్టివ్ వచ్చి దానికి ఒక పరిష్కారాన్ని చూపించాడనే పాయింట్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఏదైనా మర్డర్ మిస్టరీని కనుక్కోవడంలో డిటెక్టివ్ తన తెలివితేటలు వాడి కథను మలుపు తిప్పే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా రాసుకోగలిగితే డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయి...

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తర్వాత అలాంటి మూవీ రాలేదు...

2019 లో నవీన్ పోలిశెట్టి హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. హీరో చేత కామెడీ చేయిస్తూనే దానికి సస్పెన్స్ ను జోడించి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని సైతం ప్రేక్షకుడికి నచ్చే విధంగా దర్శకుడు మలుచుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ సినిమా సక్సెస్ ని చూసైనా డిటెక్టివ్ థ్రిల్లర్ కథలు తెలుగులో చాలానే వస్తాయి అనుకున్న వాళ్ళకి నిరాశే ఎదురైంది. వెన్నెల కిషోర్ హీరో గా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' మూవీ వచ్చినప్పటికి అందులో కథ ఎంగేజింగ్ లేకపోవడం, డిటెక్టివ్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ చాలా సిల్లీగా ఉండటంతో సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేదు...ప్రస్తుత జనరేషన్ లో ఉన్న దర్శకులెవరు డిటెక్టివ్ కథల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచాలి అంటే అన్ని జానర్స్ ని టచ్ చేస్తూ సినిమాలను చేయాలి.

కానీ తెలుగులో మాత్రం డిటెక్టివ్ థ్రిల్లర్ కథలతో పాటు హార్రర్ జానర్ లో సినిమాలను చేయడానికి దర్శకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి సినిమాలు రాకపోవడంతో వాళ్ళు నిరాశ చెందుతున్నారు. ఇతర భాషల సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి హాలీవుడ్ లో డిటెక్టివ్ థ్రిల్లర్ కథలకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఆ సినిమాలను చూస్తూ మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. స్టార్ హీరోలను మినహాయిస్తే యంగ్ హీరోలైన డిటెక్టివ్ థ్రిల్లర్ కథలతో సినిమాలను చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు చిరంజీవి సైతం 'చంటబ్బాయి' సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ నట విశ్వరూపాన్ని చూపించాడు...

Tags:    
  • telugucinema 
  • detectivethriller 
  • agentsaisrinivasaathreya 
  • navinpolishetty 

Similar News

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

Copyright @2026

Powered by Blink CMS