బిగ్ బాస్ వాళ్లని ట్రోల్ చేయడానికి నెలకు రూ.30 వేలు..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఇటీవల ఎలిమినేట్ అయిన కృష్ణుడు తన తాజా ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఇటీవల ఎలిమినేట్ అయిన కృష్ణుడు తన తాజా ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా మరో కంటెస్టెంట్ రోహిత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో కృష్ణుడు, రోహిత్ మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా వారి మధ్య జరిగిన విషయాల గురించి కృష్ణుడు మాట్లాడారు. ఈ క్రమంలో తన భార్యకు ఎదురైన ఓ సంఘటనను ఆయన వెల్లడించారు.
కృష్ణుడు చెప్పిన వివరాల ప్రకారం.. ఒకసారి తన భార్య బిగ్ బాస్ హౌస్‌కు తనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి వెళ్లిందట. అక్కడ రోహిత్ కాస్ట్యూమ్స్ చూసుకునే వ్యక్తిని ఆమె గమనించిందని కృష్ణుడు చెప్పారు. ఆ వ్యక్తి తన భార్యతో రోహిత్ గురించి ఓ విషయం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
రోహిత్ గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి తనకు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారని ఆ వ్యక్తి చెప్పినట్లు కృష్ణుడు వెల్లడించారు. అయితే ఈ విషయం తన భార్య ఇంటికి వచ్చిన తర్వాత తనకు చెప్పిందని ఆయన తెలిపారు.
అలాగే బిగ్ బాస్‌లో పీఆర్ టీమ్స్ గురించి కూడా కృష్ణుడు మాట్లాడారు. షోలోకి వెళ్లే ముందు కంటెస్టెంట్లకు పీఆర్ టీమ్స్ ఉంటాయని, అవి సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తాయని తనకు తెలియదని చెప్పారు. తాను ఎలాంటి వ్యూహాలు తెలియకుండా నిజాయితీగా షోలో పాల్గొన్నానని అన్నారు.
తన నిద్ర, తిండి విషయంలో వచ్చిన ట్రోలింగ్‌పైనా కృష్ణుడు స్పందించారు. బిగ్ బాస్ హౌస్‌లో తాను ఒక్కసారి మాత్రమే నిద్రపోయానని చెప్పారు. అలాగే తినడం కోసమే షోకు వెళ్లలేదని, తిండి కోసమే అయితే హోటల్‌కు వెళ్లేవాడినని కృష్ణుడు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బిగ్ బాస్ లో కేవలం ఒక ఆపిల్ లేదా రెండు ఆరెంజ్ లు ఇస్తారని. ఎప్పుడో ఒక ఆపిల్ తిన్నప్పుడు అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చెయ్యడం సరైన పద్ధతి కాదు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఇంటర్వ్యూ మరోసారి వైరల్‌గా మారింది.