రావిపూడి.. ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుందా?

అంటే సీనియర్ హీరో ఇమేజ్, ఆయన అభిమానుల అంచనాలు, కమర్షియల్ కథలో హీరోను ఎలా చూపించాలనే విషయంలో అనిల్‌ కు కొత్తేమీ కాదు.

Update: 2026-10-02 15:30 GMT

మల్టీస్టారర్ సినిమాలు డైరెక్టర్ అనిల్ రావిపూడికి కొత్త కాదు. ఇద్దరు హీరోలను ఒకే కథలో పెట్టి.. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో సినిమాను నడిపించడం ఇప్పటికే చేసి చూపించారు. ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో మూవీ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎఫ్2. వెంకటేశ్, వరుణ్ తేజ్‌ లను కలిపి చేసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎఫ్3లోనూ అదే కాంబినేషన్‌ ను కంటిన్యూ చేశారు. అక్కడ ఒక సీనియర్ హీరోతో పాటు మీడియం రేంజ్ హీరోను పెట్టుకుని కథను నడిపించే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఆ సినిమా సంక్రాంతి 2027కి రాబోతోంది.

వెంకటేశ్ సీనియర్ హీరో అయితే.. కళ్యాణ్ రామ్ మీడియం రేంజ్ హీరో. అంటే ఒకే కథలో ఇద్దరు హీరోల ఇమేజ్‌ లు చూసుకోవడం అనిల్‌ కు ఇప్పటికే అలవాటైన విషయమే. ఆ సినిమా కూడా మల్టీస్టారర్ కావడంతో ఆ ఎక్స్పీరియన్స్ మరోసారి ఉపయోగపడుతోంది. ఇక సీనియర్ హీరోలను డీల్ చేయడంలోనూ అనిల్‌ కు ఎక్స్పీరియన్స్ ఉంది. వెంకటేశ్‌ తో వరుసగా సినిమాలు చేయడంతో పాటు బాలకృష్ణతో భగవంత్ కేసరి చేశారు. ఇటీవల చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు కూడా తెరకెక్కించారు.

అంటే సీనియర్ హీరో ఇమేజ్, ఆయన అభిమానుల అంచనాలు, కమర్షియల్ కథలో హీరోను ఎలా చూపించాలనే విషయంలో అనిల్‌ కు కొత్తేమీ కాదు. కానీ చిరంజీవి, నాగార్జున ఇద్దరూ ఒకే సినిమాలో అంటే లెక్క కొంచెం మారుతుంది. ఇక్కడ ఇద్దరిలో ఒకరు సీనియర్ హీరో.. మరొకరు మరో రేంజ్ హీరో అనే పరిస్థితి ఉండదు. ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

అందుకే స్టోరీలో ఒకరి పాత్ర ఎక్కువగా కనిపించి.. మరొకరి పాత్ర తక్కువగా అనిపిస్తే చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇద్దరు హీరోలతో వర్క్ చేయడం కంటే.. ఇద్దరికీ ఎందుకు అలాంటి రోల్స్ ఇచ్చారనేది ప్రేక్షకుడికి కన్విన్సింగ్‌ గా అనిపించాలి. ఎవరి పాత్రనూ తగ్గించినట్టు కనిపించకూడదు. అదే సమయంలో ఇద్దరినీ ఈక్వల్ గా చూపించాలనే ప్రయత్నంలో కథ వీక్ అవ్వకూడదు. ఇదే అనిల్ రావిపూడికి కొత్త టైప్ టెస్ట్ కావచ్చు.

అలా ఇప్పటివరకు ఆయనకు మల్టీస్టారర్ అనుభవం ఉంది. సీనియర్ హీరోలతో పని చేసిన అనుభవం కూడా ఉంది. కానీ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలను ఒకే కథలో ఈక్వల్ గా నడిపించడం మాత్రం కొత్త అండ్ పెద్ద బాధ్యత. అందుకే చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌ పై వస్తున్న టాక్ నిజమైతే... అనిల్‌ కు ఉన్న మల్టీస్టారర్ ఎక్స్పీరియన్స్ సరిపోతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News