డాడ్ రివ్యూ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ !
కోలీవుడ్ నుంచి పొలిటికల్ స్క్రీన్ వరకు ఎక్కడ చూసినా ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదే తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `సిగ్మా` థియేటర్లలోకి రావడం.
కోలీవుడ్ నుంచి పొలిటికల్ స్క్రీన్ వరకు ఎక్కడ చూసినా ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదే తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `సిగ్మా` థియేటర్లలోకి రావడం. సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ పై ప్రేక్షకులతో పాటు విజయ్ అభిమానులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం తమిళనాడు సీఎం పదవిలో ఉంటూ ప్రజా సమక్షంలో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న విజయ్.. కొడుకు తీసిన సినిమా చూసి రివ్యూ ఇస్తారా లేదా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా ప్రతి తండ్రికి కొడుకు సాధించిన మొదటి విజయం ఎంతో ప్రత్యేకం. దళపతి విజయ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు తిరుగులేని సుప్రీమ్ స్టార్‌గా వెలిగినా? వారసుడు నటుడిగా కాకుండా `దర్శకత్వం` అనే క్లిష్టమైన బాధ్యతను ఎంచుకోవడం ఆయనకు ఎంతో గర్వకారణమైన విషయం. లండన్, కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన జాసన్ సంజయ్ ఏమాత్రం తొందరపడకుండా సరైన స్క్రిప్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అందుకే విజయ్ స్పందన కోసం అంతా వేచి చూస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలు, మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం, వరుస సమీక్షా సమావేశాలతో షెడ్యూల్ అత్యంత బిజీగా మారింది. రాజకీయ నాయకుడిగా నిమిషం తీరిక లేని పరిస్థితులు ఉన్నా? కొడుకు కలల ప్రాజెక్ట్ అయిన `సిగ్మా` కోసం వీలును బట్టి ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నారు. సీఎం నివాసంలో లేదా ప్రత్యేక ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా విజయ్ సినిమాను చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సినిమా విడుదలకు ముందే దీనిపై స్పందించిన దర్శకుడు జాసన్ సంజయ్.. నాన్నగారి శైలి చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. విజయ్ ఏ విషయాన్నైనా వెంటనే కాకుండా కొంత సమయం తీసుకుని, నిశితంగా విశ్లేషించిన తర్వాతే తన అభిప్రాయాన్ని బయటపెడతారని చెప్పారు. కాబట్టి సినిమా చూసిన తర్వాత విజయ్ ఇచ్చే మొదటి రివ్యూ ఒక స్టార్‌గా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ లవర్‌గా ఎంతో వాల్యూయబుల్‌గా ఉంటుందని జాసన్ నమ్ముతున్నారు.
ఇప్పటికే థియేటర్లలో `సిగ్మా` సందడి మొదలైంది. ప్రీమియర్ షోల సమయానికే జాసన్ సంజయ్ తల్లి సంగీత ,సోదరి దివ్య సాషా చెన్నైలోని థియేటర్‌కు విచ్చేసి సినిమా వీక్షించారు. కొడుకు తొలి అడుగుకు కుటుంబం అంతా పూర్తి మద్దతుగా నిలిచింది. అభిమానులు సైతం థియేటర్ల వద్ద విజయ్ ఫ్లెక్సీలతో పాటు జాసన్ సంజయ్ కటౌట్లకు పాలభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో దళపతి స్వయంగా ఈ చిత్రంపై చేసే కామెంట్ కోసం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.