ఒక్క చిన్న పోస్ట్.. సమాజాన్నే మార్చేస్తుంది- రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభా క్యారెక్టర్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ మనం సినిమాలో అతిధి పాత్ర పోషించి, అందరి దృష్టిని తన వైపు లాగేసుకుంది.

Update: 2026-10-02 14:49 GMT

ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభా క్యారెక్టర్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ మనం సినిమాలో అతిధి పాత్ర పోషించి, అందరి దృష్టిని తన వైపు లాగేసుకుంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ మరింత ప్రజాదారణ పొందిన ఈమె.. ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించినా...మళ్లీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఒకవైపు సినిమాలు , మరొకవైపు ఈవెంట్లు అంటూ సందడి చేస్తోంది.




ఈ క్రమంలోనే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా సీజన్ 13 లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె ఆరోగ్యం , పరిశుభ్రతపై తన అభిప్రాయాలను పంచుకుంది. ముఖ్యంగా తనకు పరిశుభ్రత పాటించే అలవాటు తన తల్లి ద్వారా వారసత్వంగా వచ్చింది అంటూ రాశి ఖన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. "ఆరోగ్యం అనేది మనం ఉండే ఇల్లు.. అలాగే మన చుట్టూ ఉండే పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి సోషల్ మీడియా ఒక గొప్ప సాధనం.. ఒక చిన్న పోస్ట్ ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించవచ్చు' అంటూ తన అభిప్రాయంగా పంచుకుంది రాశి ఖన్నా.




ఇకపోతే ఈ వేడుకలో పాల్గొన్న రాశి ఖన్నా అందుకు సంబంధించిన ఫోటో స్టిల్స్ ను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకట్టుకుంది. డిజైనర్ బ్రాండ్ 369 కు సంబంధించిన శారీని ధరించింది . తెలుపు రంగు బేస్ పై అందమైన నీలం రంగు ప్రింట్లతో చక్కగా అంచులతో డిజైన్ చేసిన శారీ ని కట్టుకుంది.. దీనికి కాంబినేషన్ లో నెక్ లైన్ వద్ద సి3 డిజైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజు ధరించింది.




ఈ శారీ కి కాంబినేషన్లో మెడకు నప్పేలా ముత్యాలతో రూపొందించిన చక్కని చౌకర్ ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది..మొత్తానికైతే చాలా డిగ్నిఫైడ్ గా క్లాసీ లుక్కుతో స్టైలిష్ గా కనిపించింది రాశి ఖన్నా.




రాశిఖన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈమె.. మరోవైపు అక్షయ్ కుమార్ , అనీస్ బాజ్మీ ల తదుపరి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో వస్తున్న రౌడీ అండ్ కో అనే చిత్రంలో సిద్ధార్థ్ సరసన నటిస్తోంది. అలాగే షాహిద్ కపూర్ నటించిన హిట్ ఓటిటి షో ఫర్ జి సీజన్ 2 లో కూడా ఈమె భాగమైంది. అంతేకాదు రజనీకాంత్ 173 వ చిత్రం ధర్మన్ లో కూడా కీలకపాత్ర పోషిస్తుంది . పైగా ఇందులో రామ్ పోతినేనికి ముచ్చటగా మూడోసారి ప్రేయసి పాత్రలో నటిస్తుండడం గమనార్హం.

Tags:    

Similar News