సీమ వీరుల నుంచి 'రణబాలి'కి ఇన్స్పిరేషన్.. అసలు కథ ఇదే!

విజయ్‌ దేవరకొండ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రణబాలిపై రోజురోజుకూ హైప్ పెరుగుతోంది.

Update: 2026-10-02 16:09 GMT

విజయ్‌ దేవరకొండ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రణబాలిపై రోజురోజుకూ హైప్ పెరుగుతోంది. ఇప్పటివరకు సినిమా పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్ తో ఆకట్టుకున్న మూవీ టీమ్.. ఇప్పుడు అసలు కథ వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా నెవర్ ఫర్‌ గెట్‌ ది ట్రూత్‌ డాక్యుమెంటరీ సిరీస్‌ లో మూడో ఎపిసోడ్‌ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది.




ది మెన్ వి ఫర్‌ గాట్‌ పేరుతో వచ్చిన ఆ ఎపిసోడ్‌ లో రణబాలి రోల్ ఎలా పుట్టిందో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ వివరించారు. రాయలసీమకు చెందిన పలువురు వీరుల జీవితాలు, అక్కడ ప్రచారంలో ఉన్న జానపద కథల నుంచి స్ఫూర్తి తీసుకుని విజయ్‌ పోషిస్తున్న సింగనమల బొబ్బిలి రణబాలి రోల్ రూపొందించినట్లు చెప్పారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్‌ బొబ్బిలి నాగిరెడ్డి గాథలు తనపై ప్రభావం చూపాయని తెలిపారు.




వీరి వీరోచిత కథలు ఇప్పటికీ రాయలసీమలో సాంగ్స్ రూపంలో వినిపిస్తుంటాయని చెప్పారు. ఆ ముగ్గురి జీవితాల్లోని ఒక్కో యాంగిల్ ను ‘రణబాలి పాత్రలో కలిపినట్లు దర్శకుడు వివరించారు. గడేకల్‌ బొబ్బిలి నాగిరెడ్డి ధైర్యం, తెగువ నుంచి పాత్రలోని ఒక కోణాన్ని తీసుకున్నట్లు తెలిపారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల కథలు కూడా రణబాలి రోల్ డిజైనింగ్ లో మెయిన్ గా నిలిచాయని చెప్పారు.

ఇక బుడ్డా వెంగళరెడ్డి లైఫ్ లోని మానవత్వం కూడా రోల్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచిందని రాహుల్‌ చెప్పారు. రాయలసీమలో కరవు వచ్చిన సమయంలో తన ఆస్తులను ఉపయోగించి ప్రజలకు ఆహారం అందించిన ఆయన కథ నుంచి రణబాలి పాత్రలోని ఎమోషన్స్ తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి, ధైర్యాన్ని కూడా పాత్రలోకి తీసుకొచ్చినట్లు రాహుల్‌ చెప్పారు.

ఇలా ఒక్కరి కథను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా.. రాయలసీమకు చెందిన పలువురు వీరుల లక్షణాలను కలిపి రణబాలి రోల్ ను తీర్చిదిద్దినట్లు క్లారిటీ ఇచ్చారు. తాను కూడా రాయలసీమలో పుట్టి పెరిగిన వ్యక్తినే కావడంతో.. చిన్నప్పటి నుంచి అక్కడి ప్రజల్లో చూసిన ధైర్యం, తెగువ తనపై ప్రభావం చూపాయని రాహుల్‌ తెలిపారు. ఆ అనుభవాలే విజయ్ క్యారక్టరైజేషన్ కు యూజ్ అయ్యాయని చెప్పారు.

ఇప్పటికే విడుదలైన డాక్యుమెంటరీలోని రెండు ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో ఎపిసోడ్‌ తో రణబాలి రోల్ వెనుక ఉన్న బ్యాక్ డ్రాప్ కూడా ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో విజయ్‌ పోషిస్తున్న పాత్రపై మరింత హైప్ ఏర్పడుతోంది. విజయ్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఆ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్‌ కలిసి నిర్మిస్తున్న ఆ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెవర్‌ ఫర్‌ గెట్‌ ది ట్రూత్‌ సిరీస్‌ లో నాలుగో ఎపిసోడ్‌ ది లాస్ట్‌ లోడ్‌ ను త్వరలో విడుదల చేయనున్నారు.


Full View


Tags:    

Similar News