ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?
| దర్శకుడు అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా 2028 సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్‌డేట్ అడగడంతో, త్వరలో వివరాలు వెల్లడిస్తానని అనిల్ చెప్పారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఆయన గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతి చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో 'జనవరి 12 విడుదల' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. దాంతో వరుసగా మూడు సంక్రాంతులకు అనిల్ రావిపూడి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చినట్టు అయింది. 2028 సంక్రాంతికి చేయబోతున్న సినిమా విషయంలోనూ అనిల్ రావిపూడి నుంచి క్లారిటీ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతుంది. ఆ సినిమాను 2028 సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ కన్ఫర్మ్ కావడంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో మూవీ...
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబో గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. అదుగో సినిమా, ఇదుగో టైటిల్ అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు దాన వీర శూర అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి హై అనే సినిమా ఈవెంట్‌కు హాజరు అయ్యాడు. అంతకు ముందు అనిల్ రావిపూడి ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు, ఆయన్ను జనాలు ఎక్కుగా సినిమా అప్‌డేట్ ఇవ్వమని అడిగేవారు కాదు, కానీ ఎన్టీఆర్‌తో సినిమాను ప్రకటించినప్పటికీ నుంచి ఎప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు, ఎప్పుడు విడుదల ఉంటుంది, టైటిల్ ఏంటీ, కథ ఏంటీ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద వాపోయాడని తెలుస్తోంది.
జనవరి 12 విడుదల..
హై సినిమా ఈవెంట్‌కి వెళ్లిన సమయంలో జనాల్లో చాలా మంది ఎన్టీఆర్‌తో మీరు చేయబోతున్న సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వండి అంటూ గట్టిగా అరిచారు. దాంతో అనిల్ రావిపూడి రెండు చేతులు జేబులో పెట్టుకుని స్టేజ్ దిగి కిందికి వచ్చేశాడు. ఆ తర్వాత కొంత సమయంకు అనిల్ రావిపూడి స్టేజ్ పైకి ఎక్కి ఇప్పుడే కదా సినిమాను ప్రకటించాం, తప్పకుండా ముందు ముందు చాలా అప్‌డేట్స్ వస్తాయి, మెల్ల మెల్లగా సినిమా గురించి వివరాలు చెబుతూ వస్తాను అన్నాడట. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫుల్ జోష్ తో అరిచారు. వీరి కాంబో మూవీని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. సీరియస్ మూవీని సైతం అనిల్ రావిపూడి చేయగలడు. కనుక ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా ఎలాంటి జోనర్ లో ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ కామెడీతో...
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో మూవీ అనగానే ఎక్కువ శాతం మంది కామెడీ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ చేసిన ఒకటి రెండు కామెడీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అదుర్స్ లో ఎన్టీఆర్ కామెడీ ఆయన కెరీర్ లోనే నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో చెప్పడానికి తాజాగా జరిగిన హై సినిమా ఈవెంట్‌లో అరుపులు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇకపై అనిల్ రావిపూడి ఏ సినిమా వేడుకకి వెళ్లినా, చివరకు తన జనవరి 12 విడుదల సినిమా ప్రమోషన్ సమయంలోనూ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు, అప్డేట్ ఇవ్వచ్చు కదా అని జనాలు అరవడం ఖాయం. దాంతో ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించినప్పటి నుంచి అనిల్ రావిపూడికి ప్రశాంతత లేకుండా పోతుందని కొందరు కామెడీ చేస్తున్నారు. అనిల్ మాత్రం ఈ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.