• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దర్శకుడు' హీరో.. నిర్మాత...

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

| సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాతగా అశోక్ బండ్రెడ్డి పరిచయం అవుతున్నారు. సుకుమార్, వంశీ నందిపాటితో కలిసి కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘రికార్డ్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు, ‘పుష్ప’ చిత్రాల రచనా విభాగంలో పనిచేసిన వీరా కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కర్నూలు నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

By - Tupaki Desk
Update: 2026-11-23 11:03 GMT

అగ్ర దర్శకుడు సుకుమార్ కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన భార్య తబిత సుకుమార్ నిర్మాతగా ఉన్నారు. ఆయన ప్రొడక్షన్లో ఆల్రెడీ ‘ఇడుపు కాయితం’ అనే సినిమా తెరకెక్కింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇటీవలే తబిత నిర్మాణంలో మరో సినిమా మొదలైంది. ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాత పరిచయం అవుతుండడం విశేషం. అతనే.. అశోక్ బండ్రెడ్డి. ఈ పేరు ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయమే. కొన్నేళ్ల ముందు సుకుమార్ మిత్రుడైన హరిప్రసాద్ జక్కా రూపొందించిన ‘దర్శకుడు’ సినిమాతో అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో అతను నటుడిగా ప్రయత్నాలు చేయలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘థీ స్టోరీస్’ అనే బేనర్‌లో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. సుకుమార్, వంశీ నందిపాటిలతో కలిసి అతను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమానే.. కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం మొదలైన ‘రికార్డ్’.

ఈ చిత్రంతో సుకుమార్ అసిస్టెంట్ వీరా కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరా మీడియా బ్యాగ్రౌండ్ నుంచి రావడం విశేషం. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ‘ఈనాడు’ దిన పత్రికలో వివిధ హోదాల్లో పని చేశాడు. జర్నలిజం అనుభవంతోనే కర్నూలు నేపథ్యంలో ఒక రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ కథ రాసి సుకుమార్‌తో పాటు కిరణ్ అబ్బవరంను మెప్పించి ‘రికార్డ్’ సినిమాను పట్టాలెక్కించాడు. వీర ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలకు రచనా విభాగంలో కీలక పాత్ర పోషించాడు. రామ్ చరణ్‌తో సుకుమార్ తీయబోయే కొత్త చిత్రానికి కూడా వీరా రచనా సహకారం అందించాడు.

సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు, పల్నాటి సూర్యప్రతాప్ లాంటి దర్శకులు తమ ప్రతిభను చాటుకున్నారు. వీరా కూడా దర్శకుడిగా గట్టిగానే కొట్టబోతున్నాడని ‘రికార్డ్’ స్క్రిప్టు గురించి తెలిసిన వాళ్లు చెబుతున్న మాట. స్వయంగా తాను నిర్మాణ భాగస్వామి కావడంతో పాటు తన అన్న కొడుకును కూడా సుకుమార్ నిర్మాతగా పరిచయం చేస్తున్నాడంటే సుకుమార్‌కు తన శిష్యుడి మీద, అతడి కథ మీద ఉన్న గురి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
  • sukumar 
  • ashokbandreddy 
  • kiranabbavaram 
  • recordmovie 
  • veerakogatum 
  • sukumar_p 

Similar News

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

నువ్వు కాదు.. నేను పని మాట్లాడాలి: భీమ్స్!

2026-11-23 09:19 GMT

చరణ్ కి జోడిగా కల్పన కన్ఫామ్ అయినట్లేనా?

2026-11-23 08:20 GMT

మతం మారను కానీ గౌరవిస్తా!

2026-11-23 08:18 GMT

ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?

2026-11-23 08:16 GMT

ప్రభుదేవాతో విష్ణు.. ఈసారి పెద్ద ప్లానే!

2026-11-23 08:13 GMT

Copyright @2026

Powered by Blink CMS