• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ENE రిపీట్ తో సత్తాచాటిన...

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

| ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీనాథ్ మాగంటి తన తొలి సినిమాకు రూ.10,116 పారితోషికం అందుకున్నారు. రెండో సినిమాకు రూ.10 వేలు, మూడో సినిమాకు రూ.లక్ష రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వెల్లడించారు. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’లో కార్తీక్ పాత్రతో ప్రశంసలు అందుకుంటున్న ఆయన ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By - Madhu Reddy
Update: 2026-11-23 11:03 GMT

హైదరాబాద్ కి చెందిన తెలుగు కుర్రాడు శ్రీనాథ్ మాగంటి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నిజానికి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టిన శ్రీనాథ్ మాగంటి.. సినిమాల మీద మక్కువతో విశాఖపట్నంలో నటనలో శిక్షణ తీసుకొని మరీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా 2019లో సమయం, బిలాల్ పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలతో తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈయన.. హిట్ ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

అనౌన్స్మెంట్ రోజే విమర్శలు..

ఆ తర్వాత యానిమల్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీనాథ్ మాన్షన్ హౌస్ మల్లేష్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలలో కూడా నటించారు.. అయితే అలాంటి ఈయనకు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో హిట్ మూవీ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో కార్తీక్ పాత్రలో తీసుకోబోతున్నట్లు ఎప్పుడైతే ప్రకటించారో ఆ సమయంలో విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా కార్తీక్ పాత్రకు న్యాయం చేయగలరా లేదా అనే అనుమానాలు కూడా గుప్పించారు. సుశాంత్ రెడ్డి పాత్రను శ్రీనాథ్ కి ఇవ్వడంతో సుశాంత్ అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు.

శ్రీనాథ్ నటనపై ప్రశంసలు..

అయితే సినిమా నుండి తానే తప్పుకున్నట్లు స్వయంగా సుశాంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అలా కార్తీక్ రోల్ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా.. ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా థియేటర్లలో విడుదలయ్యాక అందులో శ్రీనాథ్ నటన చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు. కార్తీక్ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశారు అంటూ శ్రీనాథ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

శ్రీనాథ్ తొలి రెమ్యూనరేషన్..

ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అందులో ఒకటి శ్రీనాథ్ మాగంటి రెమ్యూనరేషన్ కూడా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. "నేను నా మొదటి సినిమా కోసం సుమారుగా 30 రోజుల పాటు షూటింగ్ కి వెళ్లాను. అప్పుడు రూ.10,116 పారితోషకంగా ఇచ్చారు. ఇక రెండవ సినిమాకి సుమారుగా 30 నుండి 40 రోజుల వరకు పనిచేశాను .అప్పుడు పదివేలు ఇచ్చారు.

మూడవ సినిమాకే ఏకంగా లక్ష..

కానీ మూడవ సినిమా కోసం 45 నుండి 50 రోజులపాటు షూటింగ్ కి వెళ్లాను. అయితే ఆ మూడవ సినిమాకు ఏకంగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారు.అయితే రూ.10వేల నుండి మూడవ చిత్రానికి ఏకంగా లక్ష రూపాయలు అందుకోవడానికి మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ పట్టింది అంటూ తన రెమ్యూనరేషన్ గురించి కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు శ్రీనాథ్ ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    
  • srinathmaganti 
  • tollywood 
  • einagaranikemaindi 
  • hitfranchise 
  • actorremuneration 

Similar News

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

నువ్వు కాదు.. నేను పని మాట్లాడాలి: భీమ్స్!

2026-11-23 09:19 GMT

చరణ్ కి జోడిగా కల్పన కన్ఫామ్ అయినట్లేనా?

2026-11-23 08:20 GMT

మతం మారను కానీ గౌరవిస్తా!

2026-11-23 08:18 GMT

ఈఎన్ఈ రిపీట్ లో అంత ఓకే కానీ అదొక్కటే మైనస్ అయిందా?

2026-11-23 08:16 GMT

ప్రభుదేవాతో విష్ణు.. ఈసారి పెద్ద ప్లానే!

2026-11-23 08:13 GMT

Copyright @2026

Powered by Blink CMS