• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  య‌శ్ ని మ‌ళ్లీ...

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

| ‘టాక్సిక్’ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన కన్నడ స్టార్ యశ్.. ‘రామాయణం పార్ట్ 1’లో రావణుడిగా ఆకట్టుకుంటున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సినిమా సాధిస్తున్న వసూళ్లు యశ్ పాన్ ఇండియా క్రేజ్‌ను మరోసారి చర్చలోకి తెచ్చాయి.

By - Srikanth Kontham
Update: 2026-11-23 12:23 GMT

ఒక్క భారీ అపజయం ఎంతటి స్టార్ హీరోనైనా కొంతకాలం ఆలోచనలో పడేస్తుంది. కానీ సరైన సమయంలో తగిలే ఒకే ఒక్క బలమైన పాత్ర ఆ నిరాశనంతా తుడిచిపెట్టి మళ్లీ రేసులోకి తీసుకొస్తుంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. `కేజీఎఫ్ 2` తర్వాత ఎన్నో అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన `టాక్సిక్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా? తాజాగా విడుదలైన `రామాయణం పార్ట్ 1`లో లంకేశ్వరుడు రావణుడిగా యశ్ చూపించిన విశ్వరూపం ఆయ‌న్ని మళ్లీ విజయాల బాట పట్టించింది.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్` మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టినా? ఆ తర్వాత వసూళ్ల పరంగా నిలబడలేకపోయింది. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో యశ్ కెరీర్‌లో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో యశ్ క్రేజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన `రామాయణం` య‌శ్‌కు సరైన కమ్‌బ్యాక్‌గా నిలిచింది.

సాధారణంగా స్టార్ హీరో పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడానికి ఆలోచిస్తారు. కానీ యశ్ మాత్రం ఆ రిస్క్ తీసుకుని రావణుడి పాత్రకు ప్రాణం పోసారు. దశాననుడి నుంచి లంకాధిపతిగా ఎదిగే క్రమాన్ని.. ఆయనలోని అహం.. శక్తి.. గాంభీర్యాన్ని యశ్ తెరపై పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇతిహాసంలో అత్యంత శక్తిమంతమైన పాత్ర కాబట్టే తాను రావణుడిని ఎంచుకున్నానని యశ్ చెప్పిన మాటలకు తగ్గట్టే థియేటర్లలో ఆ పాత్రకు మంచి స్పందన వస్తోంది.

బాక్సాఫీస్ వద్ద కూడా `రామాయణం పార్ట్ 1` రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల నెట్ వసూళ్ల దిశగా దూసుకుపోతున్న చిత్రం యశ్ మార్కెట్‌ను మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బలంగా నిలబెట్టింది. సినిమాలో యశ్ స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని విమ‌ర్శ‌కులు సైతం ప్రశంసిస్తున్నారు.

ప్రేక్ష‌కుల రెస్పాన్స్ చూసి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రావణుడి గెటప్‌లో తన పిల్లలతో సరదాగా దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్ ఆరంభంలో కన్నడ చిత్రాల్లో పోషించిన శక్తిమంతమైన పాత్రల అనుభవమే నేడు రావణుడి పాత్రను ఇంత సహజంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడిందన్న‌ది కాద‌న‌లేని నిజం.

`టాక్సిక్` మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసి నెగిటివ్ పాత్ర అయినా? రావణ్ రూపంలో యశ్ మళ్లీ బాక్సాఫీస్ రారాజుగా నిలబడ్డారు. హీరోగా మాత్రమే కాకుండా బలమైన ప్రతినాయక పాత్రతోనూ ప్రేక్షకులను కట్టిప డేయగలనని నిరూపించుకున్న యశ్ `రామాయణం పార్ట్ 2`లో ఇంకెలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.

Tags:    
  • yash 
  • ramayana 
  • ramayanapart1 
  • ravana 
  • toxic 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS