• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప 2' బీజీఎమ్.....

'పుష్ప 2' బీజీఎమ్.. అందరికీ క్లారిటీ ఇచ్చేసిన థమన్!

| దీనిపై తాజాగా థమన్ స్పందించారు. 'పుష్ప 2' చిత్రానికి వర్క్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-11-15 07:22 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2: ది రూల్' మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. బీజీఎమ్ కోసం ఎస్. థమన్ ను తీసుకున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా థమన్ స్పందించారు. 'పుష్ప 2' చిత్రానికి వర్క్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' టైటిల్ & టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఇప్పటికే సంక్రాంతికి మీకు రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 'పుష్ప 2' చేయడానికి ఎలా టైం సరిపోతుంది?' అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి థమన్ స్పందిస్తూ.. ''పుష్ప-2 సినిమాలో నేను పార్ట్ మాత్రమే చేశాను. మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా. టూ మచ్ బిజినెస్ ఇన్వాల్వ్ అయ్యుంది. ప్రొడ్యూసర్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని విషయాలను మనం ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కానీ, అదే సమయంలో భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం మొత్తం సినిమాని ఎలా కంప్లీట్ చెయ్యగలం? నేను సినిమా చూసాను. చాలా గొప్ప సినిమా. కానీ నేను ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. దానితో డైరెక్టర్, హీరో చాలా హ్యాపీగా ఉన్నారు'' అని అన్నారు.

''పుష్ప 2: ది రూల్'' సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌ను సాంగ్స్‌కు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు ఇతర సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఎస్. థమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్ లు ఈ సినిమా బీజీఎమ్ మీద పని చేస్తున్నారని.. ఎక్కువ టైం లేకపోవడంతో ముగ్గురికీ వర్క్ ని డివైడ్ చేసి ఇచ్చారని టాక్ వినిపించింది. ఇందులో నిజమెంతని అంతా ఆలోచిస్తున్న సమయంలో, థమన్ ఈ విషయం మీద ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ మధ్య సింగర్ కార్తీక్ నిర్వహించిన కాన్సర్ట్ లో తమన్ మాట్లాడుతూ.. ''నాకోసం పుష్ప-2 వెయిటింగ్. నేను వెళ్లాలి బ్రదర్'' అంటూ అక్కడి నుంచి కదిలారు. దీంతో అల్లు అర్జున్ క్రేజీ సీక్వెల్ కి థమన్ బీజీఎమ్ అందిస్తున్నారనే సంగతి స్పష్టమైంది. ఇప్పుడు మరోసారి ఇదే విషయం మీద మ్యూజిక్ డైరెక్టర్ నోరు విప్పారు. ఆల్రెడీ తన భాగం వరకూ వర్క్ ఫినిష్ చేసినట్లుగా తెలిపారు.

'పుష్ప 2' విషయంలో దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ను మాత్రం వీరే మ్యూజిక్ డైరెక్టర్లతో చేయిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. దీనిపై సినీ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'పుష్ప 1' మ్యూజిక్ తో నేషనల్ అవార్డ్ అందుకున్న మ్యూజిక్ కంపోజర్ ను ఎందుకు పక్కన పెట్టారో అని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా డీఎస్పీ పాటలు, థమన్ బీజీఎంతో థియేటర్లలో మోత మోగడం గ్యారంటీ అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 17న పాట్నా వేదికగా రిలీజ్ అయ్యే ట్రైలర్ తోనే తమ వర్క్ ఎలా ఉంటుందనేది శాంపిల్ గా చూపిస్తారని భావిస్తున్నారు.

I’m just one part of #Pushpa2TheRule, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు.Output అయితే అదిరిపోయింది. #Pushpa2 నాకు చాలా High ఇచ్చింది.- #Thaman at #NBK109TitleTeaser launch event #AlluArjun #Sukumar #Tupaki pic.twitter.com/Ttya1i5j67

— Tupaki (@tupaki_official) November 15, 2024
Tags:    
  • Ssthaman 
  • Pushpa2 
  • Alluarjun 
  • Dakkumaharaj 
  • NBK109 
  • Devisriprasad 
  • Panindianfilm 
  • Tollywood 
  • Telugumovie 
  • BGM 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS