• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగన్ కు సపోర్ట్ చేసిన ఆ...

జగన్ కు సపోర్ట్ చేసిన ఆ తమిళ హీరో ఎక్కడ?

| వైసీపీ ఘోర ఓటమి తర్వాత సోషల్ మీడియాలో విశాల్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో విశాల్ నెగిటివ్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-07 04:20 GMT

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అఖండ మెజారిటీ అందుకుంది. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితం అయ్యింది. ఈ స్థాయిలో ఓటమిని ఎవ్వరూ కూడా ఊహించలేదు. అయితే ఎన్నికలకి ముందు వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొంతమంది సెలబ్రెటీలు మీడియా ఛానల్స్ లో ప్రస్తావించారు. వాటిపై ఛాలెంజ్ లు కూడా చేశారు.

 

యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోతాడు అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. కూటమి విజయం తర్వాత శ్యామలని టీడీపీ, జనసేన అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ పై యాంకర్ శ్యామల మాత్రం రియాక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో ఆ మధ్య విశాల్ రత్నం మూవీ ప్రమోషన్స్ లో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు.

ఏపీలో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడంటూ కామెంట్స్ చేశారు. సినిమాల వరకు పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమే అయిన జగన్ మంచి నాయకుడు అని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు. జగన్ గెలుపుపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, ఎన్నికల తర్వాత దీనిపై మాట్లాడుకుందాం అంటూ విశాల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వైసీపీ ఘోర ఓటమి తర్వాత సోషల్ మీడియాలో విశాల్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో విశాల్ నెగిటివ్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం విశాల్ ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. విశాల్ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై విశాల్ ఎలా రియాక్ట్ అవుతాడనేది వేచి చూడాలి.

కేవలం విశాల్, యాంకర్ శ్యామల మీద మాత్రమే కాకుండా వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడిన సినిమా సెలబ్రెటీలు, రాజకీయ విశ్లేషకుల సైతం ట్రోలింగ్ కి గురవుతున్నారు. దీంతో వారందరూ ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన అభిమానులు అందరూ ఫుల్ యాక్టివ్ మూడ్ లో సంతోషంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సపోర్ట్ చేసిన వారెవరూ ఇప్పట్లో బయటకి వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు.

Tags:    
  • Jaganmohanreddy 
  • Rathnammovie 
  • Vishal 
  • APPolitics 
  • Moviepromotions 
  • Anchorshyamala 
  • Socialmediatrolling 
  • Janasena 
  • Pawankalyan 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS