కోలీవుడ్ డైరెక్టర్స్- టాలీవుడ్ హీరోస్.. ట్రెండ్ మారింది!
టాలీవుడ్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సౌత్ టూ నార్త్.. ఓ ఊపు ఊపేస్తుందని చెప్పాలి.;
టాలీవుడ్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సౌత్ టూ నార్త్.. ఓ ఊపు ఊపేస్తుందని చెప్పాలి. మన హీరోల సినిమాలు వస్తాయంటే చాలు.. అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతలా టాలీవుడ్ క్రేజ్ పెరిగిపోయింది. ఒకప్పటికీ ఇప్పటికీ పూర్తిగా సీన్ మారిపోయింది. మిగతా భాషల డైరెక్టర్స్ కూడా తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తమిళ దర్శకులు కూడా మన కథానాయకులతో జత కట్టేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాంబోస్ సెట్ అవ్వగా.. మరిన్ని చర్చల్లో ఉన్నాయట. ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్.. తెలుగు స్టార్ హీరోస్ తో మూవీస్ ను తెరకెక్కిస్తున్నారు.
అందులో ముందుగా తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేస్తున్నారు. నేడు బన్నీ సందర్భంగా వారిద్దరి ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆ సమయంలో రిలీజ్ చేసిన వీడియో బట్టి మూవీ ఎలా ఉండనుందో ఇప్పటికే అందరూ ఊహించుకుంటున్నారు. అంతలా ఆకట్టుకుందీ వీడియో.
ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్, జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో దాదాపు సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీల్ మూవీ, వార్-2 కంప్లీట్ చేస్తున్న తారక్.. మరికొద్ది రోజుల్లో దిలీప్ తో మూవీ స్టార్ట్ చేయనున్నారట. రీసెంట్ గా తెలుగు నిర్మాత నాగ వంశీతో వర్క్ చేయనున్నట్లు తెలిపారు ఎన్టీఆర్. అది ఈ మూవీకేనని స్పష్టంగా తెలుస్తోంది.
మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో మూవీ చేసేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కూలీ సినిమా చేస్తుండగా.. అది అయ్యాక డార్లింగ్ మూవీ వర్క్ ను స్టార్ట్ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
మొత్తానికి అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు తెలుగు హీరోలతో బిజీ అయ్యారు.. బిజీ కానున్నారు.. అయితే ఒకప్పుడు కోలీవుడ్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు చూసి తెలుగు ఆడియన్స్ షాకయ్యేవారు. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివపుత్రుడు, రోబో.. వంటి చిత్రాలు చూసి తెలుగులో ఇలాంటివి వస్తే బాగుండేవని అనుకునేవారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ దర్శకులే టాలీవుడ్ హీరోలతో చేస్తున్నారు. అలా ట్రెండ్ ఫుల్ గా మారిపోయిందనే చెప్పాలి.