బీజేపీ లీడ‌ర్‌పై త్రిష టీమ్ లీగ‌ల్ యాక్ష‌న్‌!

త‌మిళనాడు రాజ‌కీయాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌, హీరోయిన్ త్రిష పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-02-16 09:19 GMT

త‌మిళనాడు రాజ‌కీయాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌, హీరోయిన్ త్రిష పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్ద‌రిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు నైనార్ నాగేంద్ర‌న్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీవీకే నాయ‌కుడు, హీరో విజ‌య్‌తో త్రిష‌ని ముడిపెడుతూ ఆయ‌న చేసిన కామెంట్స్ త‌మిళ‌నాట తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ముందు విజ‌య్ త్రిష ఇంటి నుంచి బ‌య‌టికి రావాల‌ని, అలా వ‌స్తేనే ఏదైనా జ‌రుగుతుందని ఆయ‌న చేసిన ఘూటు వ్యాఖ్య‌లు అభిమానుల‌తో పాటు టీవీకే పార్టీ శ్రేణుల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించాయి.

హీరో విజ‌య్‌ని రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న మెడ‌కే చుట్టుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనిపై ప‌లువురు విమ‌ర్శలు చేస్తున్న వేళ త్రిష త‌న లీగ‌ల్ టీమ్‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. త‌నపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నైనార్ నాగేంద్ర‌న్‌పై లీగ‌ల్గా స్పందించింది. తాజాగా త్రిష త‌రుపు న్యాయ‌వాది నిత్యేష్ న‌ట‌రాజ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తూ లీగ‌ల్ యాక్ష‌న్‌కు సంబంధించిన ఓ లెటర్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు.

అవమానం ఎప్పుడైనా అవ‌మాన‌మే. స్థానం పెద్ద‌దైతే బాధ్య‌త కూడా పెద్ద‌దే. వ్య‌క్తిగ‌త జీవితాన్ని రాజ‌కీయాల కోసం లాగ‌డ‌టం స‌రైంది కాదు. గౌర‌వం ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర‌వాలేదు క‌నీసం అవ‌మానించ‌కండి` అంటూ త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు నైనార్ నాగేంద్ర‌న్‌పై ఫైర్ అయ్యారు. నా క్లైంట్ త్రిష కృష్ణ‌న్ పేరు మోసిన ఇండియ‌న్ యాక్ట‌ర్‌. నా క్లైంట్‌పై చేసిన అసహ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్నాయి. వాటి ఆధారంగానే ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నాం.

నా క్లైంట్ త్రిష ఇలాంటి అవ‌మాన‌క‌ర‌మైన అస‌హ్య‌మైన వ్యాఖ్య‌ల‌ని రాష్ట్ర రాజ‌కీయాల్లో హై స్టేచ‌ర్ ఉన్న వ్య‌క్తి నుంచి వ‌స్తాయ‌ని ఊమించ‌లేదు. నా క్లైంట్ త‌ను ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాద‌ని, ఏ పార్టీకి తాను సానుభూతి ప‌రురాలి కూడా కాద‌ని క్లియ‌ర్ చేసింది. అంతే కాకుండా గ‌త కొంత కాలంగా ఇదే స్టాండ్‌ని మెయింటైన్ చేస్తూ వ‌స్తోంది. అలాగే త‌ను పాలిటిక్స్‌లోకి వ‌స్తే స‌హ‌జ‌సిద్ధంగానే వ్య‌వ‌హ‌రిస్తుంది. ఓ ఆర్టిస్ట్‌గా త‌ను త‌న క్రాఫ్ట్‌కు సంబంధించిన విష‌యాల‌పై డిఫైన్ చేస్తుందే కానీ ఎలాంటి పొలిటిక‌ల్ విష‌యాల‌పై జోక్యం చేసుకోదు.

మ‌రీ ముఖ్యంగా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ని ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్‌లలో చ‌ర్చించ‌డం అనేది భావ్యం కాదు. అందులోనూ పెద్ద స్థాయిలో ఉన్న వ్య‌క్తులు ప‌బ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల‌లో మాట్లాడుతున్న‌ప్పుడు బాధ్య‌తాయుతంగా, స‌మాన‌త్వంతో వ్య‌వ‌హ‌రిచాలి. అని నా క్లైంట్ రిక్వెస్ చేస్తూ ఇక‌పై ఇలాంటి విష‌యాల్లో త‌న అనుమ‌తి లేకుండా త‌న పేరుని వాడ‌రాద‌ని కోరుతోంది` అంటూ త్రిష లాయ‌ర్ నిత్యేష్ న‌ట‌రాజ‌న్ ఓ లెట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో కొస‌మెరుపు ఏంటంటే ఎక్క‌డ విజ‌య్ పేరునిగాని త‌మిళ‌నాగు బీజేపీ అద్య‌క్షుడి పేరు గానీ మెన్ష‌న్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.



Tags:    

Similar News