టైటిల్స్.. ఇకపై జాగ్రత్త పడకపోతే ఇబ్బందులేనా?

టాలీవుడ్‌ లో ఈ మధ్య సినిమా టైటిల్స్ విషయంలో కొత్త టెన్షన్ మొదలైంది. షూటింగ్ పూర్తై, ప్రమోషన్లు స్టార్ట్ అయిన తర్వాత కూడా చివరి నిమిషంలో టైటిల్స్ మార్చాల్సిన పరిస్థితి నిర్మాతలకు తలనొప్పిగా మారుతోంది.;

Update: 2026-02-16 08:25 GMT

టాలీవుడ్‌ లో ఈ మధ్య సినిమా టైటిల్స్ విషయంలో కొత్త టెన్షన్ మొదలైంది. షూటింగ్ పూర్తై, ప్రమోషన్లు స్టార్ట్ అయిన తర్వాత కూడా చివరి నిమిషంలో టైటిల్స్ మార్చాల్సిన పరిస్థితి నిర్మాతలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా సెన్సార్ అభ్యంతరాల కారణంగా మార్చాల్సి వస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది.




ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ మూవీకి ఇదే సమస్య ఎదురైంది. మొదట ఫిక్స్ చేసిన టైటిల్‌ పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కపుల్ ఫ్రెండ్లీ అనే పేరు బదులుగా ఫ్రెండ్లీ కపుల్ గా మార్చితేనే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని సూచించారట. అయితే అప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్లపై భారీగా ఖర్చు చేసింది. పోస్టర్లు, టీజర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించింది.

అవన్నీ కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ తో నడవడంతో లాస్ట్ మినిట్‌ లో టైటిల్ మార్చడం కష్టమైందని టాక్ వినిపిస్తోంది. దీంతో అదే పేరుతో రిలీజ్ చేయాల్సి వచ్చిందని మూవీ టీమ్ ఇప్పటికే వివిధ ఈవెంట్స్ లో వెల్లడించింది. ఇప్పుడు ఇదే పరిస్థితి మరో చిన్న చిత్రానికి కూడా ఎదురైంది. యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా మొదట 'హే భగవాన్' అనే టైటిల్‌ తో ప్రారంభమైంది.

అయితే తాజాగా దాన్ని మార్చి 'హే బల్వంత్'గా మేకర్స్ ప్రకటించారు. ఒక్కసారిగా టైటిల్ మారడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. భగవాన్ అనే పదం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించినదిగా ఉండటంతో సెన్సార్ నుంచి సూచనలు వచ్చాయని ప్రచారం సాగుతోంది. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందుగానే పేరు మార్చినట్టు సమాచారం. అందులో నిజమెంత అనేది తెలియకపోయినా.. కొత్త పోస్టర్లతో హే బల్వంత్ గా రీ బ్రాండ్ చేశారు మేకర్స్.

టైటిల్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు, అది సినిమా బ్రాండ్. ఒకసారి ప్రమోషన్స్ మొదలైతే ప్రేక్షకుల్లో ఆ పేరే గుర్తింపు తెస్తుంది. ఇలాంటి సమయంలో మార్పులు చేయడం నిర్మాతలకు అదనపు ఖర్చుతో పాటు గందరగోళం సృష్టిస్తోంది. ఏదేమైనా, వరుసగా రెండు సినిమాలకు టైటిల్ ఇష్యూ రావడంతో ఇకపై దర్శకనిర్మాతలు ముందుగా సెన్సార్ నిబంధనలు చెక్ చేసుకుని ఫైనల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే రిలీజ్ టైమ్లో ఇలాంటి చిక్కులు తప్పవని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

ఎందుకంటే సెన్సార్ సభ్యులు.. తమ నిబంధనలు, సున్నితమైన పదాలు, డబుల్ మీనింగ్లు లేదా మతపరమైన సూచనలపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అందుకే టైటిల్ ఫైనల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంతా సూచిస్తున్నారు. విడుదల సమయానికి ఇలాంటి మార్పులు తప్పించుకోవాలంటే ముందుగా సెన్సార్ నుంచి క్లారిటీ తీసుకోవడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Tags:    

Similar News