45లో మామ్ 25లో డాట‌ర్ చంపేస్తున్నారుగా

బాలీవుడ్ బుల్లితెర క్వీన్ శ్వేతా తివారీ..ఆమె గ్లామరస్ కూతురు పాలక్ తివారీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారారు.;

Update: 2026-02-16 10:30 GMT

బాలీవుడ్ బుల్లితెర క్వీన్ శ్వేతా తివారీ..ఆమె గ్లామరస్ కూతురు పాలక్ తివారీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారారు. 45 ఏళ్ల వయసులోనూ శ్వేత తన 25 ఏళ్ల కూతురికి గ్లామర్ విషయంలో గట్టి పోటీనివ్వ‌డం చ‌ర్చ‌గా మారింది.

ఆ ఇద్ద‌రి ఫిట్‌నెస్ రహస్యాలను తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

శ్వేతా తివారీ త‌న‌దైన అందం, సొగ‌స‌రి దేహ‌శిరుల‌తో 40ప్లస్ వయసులోనూ గుబులు రేపుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సీనియ‌ర్ న‌టి తన ఫిజిక్‌ను అద్భుతంగా కాపాడుకుంటున్నారని కితాబు అందుకుంటోంది. శ్వేతాజీ ఇన్ స్టా ఫోటోషూట్లకు జెన్ జెడ్ యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

శ్వేత తివారీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. 2026 ప్రారంభంలో అమిత్ ఖన్నా `రుబారు క్యాలెండర్ షూట్‌`లో ఆర్మీ ఆఫీసర్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సిద్ధార్థ్ మల్హోత్రా `వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే మైథలాజికల్` థ్రిల్లర్ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. `కసౌతీ జిందగీ కే` లో న‌ట‌న‌తో గుర్తింపు పొందిన శ్వేతా `బిగ్ బాస్ 4` విజేతగా నిలిచి ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ఇక శ్వేతా తివారీ కుమార్తె పాల‌క్ తివారీ గ్లామ‌ర్ షోస్ గురించి యూత్ ఇప్ప‌టికే పిచ్చెక్కిపోతోంది. ఈ టీనేజీ బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తున్న ఫోటోషూట్ల‌కు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. అయితే పాతిక వ‌య‌సు పాల‌క్ తో మామ్ శ్వేతా పోటీప‌డుతుండ‌ట‌మే యూత్ ని మ‌రింత ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంది.

సల్మాన్ ఖాన్ `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` చిత్రంతో వెండితెరకు పరిచయమైన పాలక్.. ఆరంభ‌ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయారు. సంజయ్ దత్, మౌనీ రాయ్‌లతో కలిసి `ది భూత్నీ` అనే హారర్ కామెడీలో నటించింది. అలాగే `రోమియో ఎస్ 3`, రోజీ: ద సాఫ్రన్ చాప్టర్ వంటి చిత్రాలు త‌దుపురి విడుదల కాబోతున్నాయి.

సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని, స్టార్ కిడ్ అని ముద్ర వేసినా తన తల్లి శ్వేత పడిన కష్టాలతో పోలిస్తే తన పోరాటం చాలా తక్కువని పాలక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పాల‌క్ ప్ర‌ముఖ హీరో సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో డేటింగ్ చేయ‌డం నిరంత‌రం వార్త‌ల్లోకొస్తోంది.

క‌లిసే జిమ్ చేస్తారా?

తల్లీ కూతుళ్ల ఫిట్‌నెస్ మంత్ర అద్భుతం. వీరిద్దరూ కలిసి జిమ్‌కి వెళ్తారా? అంటే పాల‌క్ ఏం చెప్పారంటే... శ్వేత రోజూ జిమ్‌కి వెళ్లరు. త‌న‌ ఫిట్‌నెస్ రహస్యం `మితాహారం`.. క్రమం తప్పకుండా చేసే వాకింగ్. అయితే ఇటీవల ఆమె పైలేట్స్.. వెయిట్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. పాలక్ మాత్రం వారంలో 5 రోజులు కచ్చితంగా జిమ్‌కి వెళ్తారు. యువ‌న‌టికి కార్డియో అంటే చాలా ఇష్టం.అయితే త‌ల్లి కూతురు క‌లిసి ఎప్పుడూ జిమ్ చేయరు.

Tags:    

Similar News