ఎట్టకేలకు విజయ్ - రష్మిక వెడ్డింగ్ కార్డ్ వైరల్.. రిసెప్షన్ వెన్యూ ఎక్కడంటే?

2018లో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న తొలిసారి నటించిన చిత్రం ' గీత గోవిందం'. ఇందులో జంటగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.;

Update: 2026-02-16 09:42 GMT

2018లో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న తొలిసారి నటించిన చిత్రం ' గీత గోవిందం'. ఇందులో జంటగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. జంట అంటే ఇలా ఉండాలి అని అందరి చేత అనిపించారు కూడా.. అలాంటి ఈ జంట ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు 2019లో 'డియర్ కామ్రేడ్ ' సినిమా సమయంలో ఆ బంధం బలపడిందని , డేటింగ్ కూడా చేసుకుంటున్నారు అనే వార్తలు జోరుగా తెరపైకి వచ్చాయి.




ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా.. ఇద్దరు వెకేషన్ కి వెళ్లడం .. విమానాశ్రయాలలో కనిపించడం.. అటు రష్మిక.. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడం, వారితో కలిసి సినిమాలు చూడడం లాంటివి చేస్తూ వచ్చింది. ఇక దీంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడ ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. అయితే వీరి చేతి వేళ్ళకి ఉన్న డైమండ్ రింగ్స్ వీరి నిశ్చితార్థాన్ని కన్ఫామ్ చేశాయి.

ఇకపోతే అప్పటినుంచి వీరిద్దరూ రాజస్థాన్ లో జైపూర్ లోని ఉదయపూర్ లో ఉన్న ఒక గ్రాండ్ ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారని, ముఖ్యంగా ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న వీరి వివాహం ఉదయపూర్ లోనే జరుగుతోంది. దీనికి తోడు మార్చి 4వ తేదీన రిసెప్షన్ కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే అటు విజయ్ దేవరకొండ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్గా కలిశారు. అయితే అక్కడి నుండి బయటకు వచ్చిన ఫోటోలు జనరల్గా కనిపించినా.. ఆయన మాత్రం తన ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికే వెళ్లినట్లు సమాచారం.

ఇకపోతే ఇంత జరుగుతున్నా ఈ జంట అఫీషియల్ గా బయటపడలేదు. ఎందుకు ఇంత రహస్యంగా తమ పెళ్లి వేడుకను ఉంచనున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. సడన్గా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు హైదరాబాదు వేదికగా జరిగే రిసెప్షన్ కి సంబంధించిన వెన్యూ కూడా అందులో ఉండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే..తాజాగా బయటకు వచ్చిన ఆ వెడ్డింగ్ కార్డులో హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్లో 4 మార్చి 2026 సాయంత్రం 7:00 గంటల నుండి రిసెప్షన్ జరగనుంది.. అంటూ ఒక వెడ్డింగ్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయినా సరే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. మొత్తానికైతే వెడ్డింగ్ కార్డుతో సహా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ జంట ఓపెన్ అవుతుందో లేక డైరెక్ట్ గా పెళ్లి ఫోటోలతో దర్శనమిస్తుందో చూడాలి.

Tags:    

Similar News