పవన్ 'ఉస్తాద్'.. మేకర్స్ అసలు గమనిస్తున్నారా?

నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. కానీ ఈసారి విడుదలైన పోస్టర్లు మాత్రం వారిలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి.;

Update: 2026-02-16 07:40 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఉస్తాద్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా.. వచ్చే నెల 26న రిలీజ్ కానుంది.




 


విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన దేఖ్లేంగే సాలా సాంగ్ ఓ రేంజ్ లో అందరినీ మెప్పించింది. పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ కు దేవిశ్రీప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ బీట్ యాడ్ కావడంతో ఆ సాంగ్ ట్రెండింగ్‌ లో నిలిచింది. మొదటి పాట సూపర్ హిట్ కావడంతో సినిమా మీద ఆడియన్స్ లో హైప్ మరింత పెరిగింది.

అయితే ఇప్పుడు ఓవైపు రెండో పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతుండగా.. మరోవైపు పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. కానీ ఈసారి విడుదలైన పోస్టర్లు మాత్రం వారిలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. పోస్టర్లు నేచురల్ గా ఉండటం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

కొన్ని రోజులుగా మేకర్స్ రిలీజ్ చేస్తున్న పోస్టర్లపై విమర్శలు వస్తున్నాయి. డిజైన్, టెక్స్చర్, లైటింగ్ ఎఫెక్ట్స్ ఆర్టిఫీషియల్ గా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే ఇవి కంప్లీట్ గా ఏఐ సహాయంతో క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరో సినిమా ప్రమోషన్‌ కు ఉండాల్సిన గ్రాండ్ లుక్, ఒరిజినాలిటీ, పవర్ ఫుల్ ప్రెజెంటేషన్ కనిపించలేదని అంటున్నారు.

ముఖ్యంగా తమ హీరోపై విమర్శలు వస్తే ఎదురు నిలిచే ఫ్యాన్స్, ఈసారి మాత్రం పోస్టర్ల క్వాలిటీపై మేకర్స్‌ను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద స్టార్ సినిమా అయితే పోస్టర్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా, ఫస్ట్ ఇంప్రెషన్ స్ట్రాంగ్ గా లేకపోతే హైప్ తగ్గిపోతుందంటూ చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతుండగా.. మేకర్స్ అసలు గమనిస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది.

ఇప్పటికైనా ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని, అట్రాక్టివ్ పోస్టర్స్ తో పాటు పవర్ ఫుల్ టీజర్స్ విడుదల చేయాలని సూచిస్తున్నారు నెటిజన్లు. లేకుంటే సినిమాపై ఇప్పటికే క్రియేట్ అయిన హైప్ తగ్గుతుందని, సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా.. ప్రమోషన్స్ కూడా బాగా చేయాలని చెబుతున్నారు. ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి ఇకపై మేకర్స్ సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తారా? లేక ఇదే కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి.

Tags:    

Similar News