పుష్పరాజ్ ఇమేజ్ ను లోకేష్ తుడిపెయ్యబోతున్నారా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి తమ మేకోవర్ ను మార్చుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి తమ మేకోవర్ ను మార్చుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ముఖ్యంగా సరైన పాత్ర పడాలే కానీ తనలోని నటుడిని బయటకు తీస్తూ తెరపై విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అలా పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రతో ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ పాత్రతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించారు . అలాంటి ఈయన ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ కోసం లోకేష్ వినూత్న ప్రయత్నం..
ఈ సినిమా తర్వాత మళ్లీ మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అయితే మరొకవైపు లోకేష్ కూడా డీసీ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నారు. తన సినిమా పూర్తయిన వెంటనే.. ఇటు రాకా సినిమా కంప్లీట్ అయ్యేలోపు AA23 సినిమా స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇకపోతే ఇక్కడ మరో బలమైన వార్త అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. AA23 సినిమా కోసం అల్లు అర్జున్ మరో భారీ ట్రాన్స్ఫర్మేషన్ కి సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్పరాజ్ ఇమేజ్ ను చెరిపేయడమే లక్ష్యం..
పుష్పరాజ్ ఇమేజ్ ని పూర్తిగా దాటి కొత్త స్క్రీన్ ఐడెంటిటీ ని తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారట. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ డిజైన్ పై నెలల తరబడి వర్క్ జరిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్లో కూడా బన్నీని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం జరుగుతోందట. హీరోయిన్ , రొమాంటిక్ ట్రాక్ కంటే కూడా కథకే ప్రాధాన్యం ఇచ్చే లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
హీరోయిన్ కాదు.. కథకే ప్రాధాన్యత..
అంతేకాదు ఈ మేరకు మరోవైపు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉండదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఊహాగానాలు అన్నింటికీ తెరపడాలి అంటే కచ్చితంగా లోకేష్ స్పందించాల్సిందే అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ గనుక ఈ సినిమాలో నిజమైతే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ ని అందుకోవడమే కాకుండా అల్లు అర్జున్ కి పుష్పరాజ్ కాకుండా మరో కొత్త నేమ్ రాబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.