• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ టాలెంట్‌పై హైబ్...

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

| ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న అంతర్జాతీయ గర్ల్ గ్రూప్ `క్యాట్సయ్` రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన గ్లోబల్ క్యాస్టింగ్ ఎగ్జిక్యూటివ్ మిచెల్ చోంగ్ దృష్టంతా భారత్ వైపు మళ్లించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-03 07:52 GMT

ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న అంతర్జాతీయ గర్ల్ గ్రూప్ `క్యాట్సయ్` రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన గ్లోబల్ క్యాస్టింగ్ ఎగ్జిక్యూటివ్ మిచెల్ చోంగ్ దృష్టంతా భారత్ వైపు మళ్లించారు. కే-పాప్ తరహా శిక్షణ, గ్లోబల్ పాప్ అప్పీల్‌ను మిళితం చేసి భారతదేశం నుంచి మొట్టమొదటి గ్లోబల్ గర్ల్ గ్రూప్‌ను తయారు చేసేందుకు రంగంలోకి దిగారు. విదేశీ సంగీత పరిశ్రమలో సరికొత్త సంచలనాలు సృష్టించిన ఈ మాస్టర్ మైండ్ ఇప్పుడు భారతీయ యువతలోని టాలెంట్‌ను ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రఖ్యాత ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం `హైబ్` -`గెఫెన్ రికార్డ్స్` ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న `క్యాట్సయ్` గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తోందో చెప్పాల్సిన ప‌నిలేదు. వివిధ దేశాలకు చెందిన యువ తులను ఏకతాటిపైకి తెచ్చి కఠినమైన శిక్షణతో గ్లోబల్ స్టార్లను తయారు చేయడంలో మిచెల్ చోంగ్ అనుభవం అనన్యసామన్య‌మైనది. ఇప్పుడు అదే విజయవంతమైన బ్లూప్రింట్‌ను భారతదేశంలో అమలు చేసేందుకు హైబ్ సంస్థ భారత్‌లో ప్రత్యేక ఆడిషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో మిచెల్ చోంగ్‌తో పాటు ప్రముఖ ముంబై క్యాస్టింగ్ డైరెక్టర్ పంచమి ఘావ్రి కూడా భాగస్వామ్యం కావడం విశేషం.

భారతీయ సంగీత సంస్కృతికి.. పాశ్చాత్య పాప్ సంప్రదాయానికి మధ్య చక్కని వారధిలా నిలవాలని ఈ బృందం భావిస్తోంది. మన దేశంలో అపారమైన గాత్ర, నృత్య ప్రతిభ ఉందని అయితే సరైన గ్లోబల్ ప్లాట్‌ఫాం దొరకని ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్నారని మిచెల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ గాయకులను మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పాప్ స్టార్‌లలో ఉండాల్సిన `ఇట్` ఫ్యాక్టర్, అడాప్టబిలిటీ, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న యువతులను వెతికి పట్టుకోవడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

భారతదేశం నుంచి వస్తున్న సరికొత్త మ్యూజిక్ ప్రాజెక్టు పట్ల దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల నుంచి, యువత నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. సోషల్ మీడియా సరిహద్దులను దాటి ప్రతిమూలకూ ఈ వార్త చేరడంతో వేలాది మంది యువతులు ఆడిషన్స్ కోసం పోటీపడుతున్నారు. హైబ్ సంస్థ భారతదేశాన్ని తదుపరి గ్లోబల్ గర్ల్ గ్రూప్ వేదికగా ఎంచుకోవడం భారతీయ మ్యూజిక్ ఇండస్ట్రీలో చారిత్రాత్మక మైలురాయిగా ట్రేడ్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

భారతీయ మూలాలున్న గాత్రాలు.. విభిన్న నృత్యరీతులు అంతర్జాతీయ పాప్ వేదికలపై మెరిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిణామాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. మిచెల్ చోంగ్ అనుభవం.. హైబ్ సంస్థ అనుసరించే కఠినమైన ట్రెయినింగ్ సిస్టమ్ కలగలిసి రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే మరో గొప్ప గ్లోబల్ మ్యూజికల్ ఐకాన్‌ను భారత్ నుంచి అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • hybe 
  • katseye 
  • michellechoong 
  • globalgirlgroup 
  • indianmusic 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS