• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి మొదటి సారి...

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

| దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. ఆయన తీసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తుంటాయి.

By - Gopi Velupala
Update: 2026-11-03 06:58 GMT

దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. ఆయన తీసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తుంటాయి.ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కథలో ఉత్కంఠ ను రేపుతూ తన కథనం తో ప్రేక్షకులను కట్టిపడేయడం ఆయన శైలి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో హాలీవుడ్ దిగ్గజ దర్శకుల ప్రశంశలను అందుకున్న రాజమౌళి ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతటి ఘన విజయాలు సాధించిన రాజమౌళి తను మొదటిసారి డైరెక్షన్ చేసినప్పుడు ఏం చేశారో తెలుసా?

అమ్మకు ప్రేమతో...

తన కెరీర్ ప్రారంభంలో రాజమౌళి 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు' దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఆ సమయంలో రాఘవేంద్ర రావు పర్యవేక్షణ లో వచ్చిన 'శాంతి నివాసం' సీరియల్ కి రాజమౌళి కి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. గురువు తన మీద పెట్టిన బాధ్యత ను ఎక్కడ అడ్డంకి లేకుండా నిర్వహించాలని రాజమౌళి మొదటి రోజు షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. మొదటి సారి మైక్ చేతిలోకి తీసుకొని ఫస్ట్ షాట్ కి యాక్షన్ చెప్పిన వెంటనే రాజమౌళి పక్కకెళ్లి చిన్న ఫోన్ తో వాళ్ల అమ్మగారికి ఫోన్ చేసి ఈరోజు మొదటిసారి నేను షూటింగ్ లో యాక్షన్ చెప్పాను. ఈ రోజు నుంచి నేను డైరెక్టర్ ను అమ్మ అని ఎంతో ఆనందంతో చెప్పాడట. ఆ సమయంలో రాజమౌళి పక్కనే ఉన్న నటుడు తనికెళ్ళ భరణి ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారట. ఒక ఇంటర్వ్యూ లో తనికెళ్ళ భరణి ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. తన జీవితంలో అత్యంత కీలకమైన, ఆనందకరమైన ఘట్టాన్ని ఎవరితోనో పంచుకోకుండా వాళ్ల అమ్మతో పంచుకోవడం చూస్తుంటే రాజమౌళి కి అమ్మ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అంటూ ఆయన కొనియాడారు...

పర్ఫెక్షన్ తోనే విజయాలను సాధిస్తున్నాడు...

బుల్లితెర సీరియల్ నుంచి మొదలైన రాజమౌళి ఇప్పుడు ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడంటే కారణం ఆయన పర్ఫెక్షన్...కథ, స్క్రీన్ ప్లే, పాత్రలను డిజైన్ చేసే విధానం ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీ గా ఉంటాడు. మేకింగ్ విషయంలో అసలు ఎక్కడ రాజీ పడడు. ఒక షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు తీస్తూనే ఉంటాడు. అంతటి పర్ఫెక్షన్ ఉంది కాబట్టే ఈ రోజు ఆయన గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్స్ ను బాగా హ్యాండిల్ చేస్తారు. అందుకే ఆయన మూవీస్ ను ప్రేక్షకులు రిపిటెడ్ గా చూస్తుంటారు...

Tags:    
  • ssrajamouli 
  • tanikellabharani 
  • rajamouli 
  • shantinivasam 
  • tollywood 

Similar News

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Copyright @2026

Powered by Blink CMS