ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!
| నవంబర్ రెండవ తేదీన తన పుట్టినరోజు కావడంతో ఈసారి ఈ పుట్టినరోజును కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా జరుపుకున్నట్లు పంచుకుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, సీరియల్స్ ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా థామస్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. మలయాళం లోనే సినిమాలు చేస్తూ ఆకట్టుకున్న నివేదా థామస్.. తొలిసారి 2016లో జెంటిల్మెన్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వచ్చిన నిన్ను కోరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. జై లవకుశ , జూనియర్ లవర్ ఆఫ్ ఇడియట్, బ్రోచేవారెవరు, 118 వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా తో కలసి శాకిని డాకిని అనే చిత్రంలో నటించి దాదాపు రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. మళ్లీ 35 చిన్న కథ కాదు అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో తన అద్భుతమైన నటనతో గద్దర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది.
ఈ చిత్రం తర్వాత దాదాపు 3 ఏళ్లపాటు తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. ఇన్నాళ్లకు మరో కొత్త ప్రాజెక్టు ప్రకటించింది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శ్రీమతి. ఒక చక్కని ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ట్రెడిషనల్గా, హోమ్లీ లుక్ లో మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమైంది నివేదా థామస్. దాదాపు మూడు ఏళ్ల తర్వాత మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్టు షేర్ చేశారు.
నవంబర్ రెండవ తేదీన తన పుట్టినరోజు కావడంతో ఈసారి ఈ పుట్టినరోజును కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా జరుపుకున్నట్లు పంచుకుంది. ఇకపోతే శ్రీమతి షూటింగ్ సెట్లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది నివేదా థామస్. అందులో.." ఈ ఏడాది పుట్టినరోజును కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా గడిపినప్పటికీ.. ఒక సినిమా సెట్ లో నా సొంత ఇంట్లో ఉన్న అనుభూతిని పొందాను. ఎదురు చూడాల్సిన సన్నివేశాలు, స్క్రిప్ట్ చర్చల్లో మునిగిపోయి.. సాయంత్రం 5:30 గంటలకు వర్షం కురుస్తున్న సూర్యాస్తమయాన్ని చూస్తూ.. బీన్ బ్యాగుపై ఒక కొండ అంచున కూర్చొని చేతిలో వేడి వేడి ఛాయ్ తో కరకరలాడుతూ మరీ నూనెగాలేని మొలగ బజ్జీలు తినడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా ఈ అనుభూతిని నేను వర్ణించలేను.
నేను చూసిన, చూడని, తెలిసిన, తెలియని ప్రజలందరికీ, మీ దయగల మాటలకు శుభాకాంక్షలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతుకు, ప్రేమకు, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం, సినిమా అవకాశాలు , ఆత్మ సానుభూతి, తక్కువ విమర్శలు, ఆహారం, మీ అందరి ప్రార్థనలు నాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ఒక పోస్టు షేర్ చేసింది.
ఇకపోతే తాజాగా నివేదా థామస్ షేర్ చేసిన ఫోటోలలో తన బర్తడే సందర్భంగా షూటింగ్ సెట్లో జరుపుకున్న బర్తడే సెలబ్రేషన్స్ కేక్ అలాగే తన 5వ యేట జరుపుకున్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటో ని కూడా నివేదా థామస్ షేర్ చేసింది. ఇక మరొక ఫోటోలో సినిమాకు సంబంధించి మెడలో నల్లపూసలు ధరించి శ్రీమతి లుక్ లో ఆకట్టుకుంది.