• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జైలర్ 2: ఇలా జరిగుంటే...

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

| ముఖ్యంగా తమిళనాడులో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో ఫ్యాన్స్ షోలు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.

By - M Prashanth
Update: 2026-11-03 04:33 GMT

ఒక సినిమా వందల కోట్లు వసూలు చేసినా ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం మిస్సయిందని ఎవరైనా అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రజనీకాంత్ 'జైలర్ 2' విషయంలో ఇప్పుడు అలాంటి అభిప్రాయమే వినిపిస్తోంది. ఇప్పటికే రూ.800 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా మరో రూ.400 కోట్ల వరకు అదనంగా వసూలు చేసేదని ప్రముఖ తమిళ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రజనీ సినిమాకు అంత పెద్ద మొత్తం ఎక్కడ మిస్సయిందనేదే అసలు ప్రశ్న.

తిరుప్పూర్ సుబ్రమణ్యం చెప్పిన దాని ప్రకారం తమిళనాడులో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం, తెల్లవారుజామున ప్రత్యేక షోలు ఉండి ఉంటే 'జైలర్ 2' ఏకంగా రూ.1200 నుంచి రూ.1300 కోట్ల గ్రాస్ సాధించేదట. గతంలో రజనీ '2.0'కు టికెట్ ధరల విషయంలో వెసులుబాటు ఉండగా, విజయ్ 'లియో'కు ఎర్లీ మార్నింగ్ షోలు కలిసొచ్చాయని గుర్తుచేశారు. కానీ 'జైలర్ 2'కు ఈ రెండూ అందుబాటులో లేకపోవడంతో భారీ వసూళ్లు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా తమిళనాడులో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో ఫ్యాన్స్ షోలు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. చాలాచోట్ల ఉదయం 9 గంటల తర్వాతే రెగ్యులర్ షోలు మొదలయ్యాయి. దీనివల్ల తొలి రోజే రూ.5 నుంచి రూ.6 కోట్ల గ్రాస్ మిస్సయిందని చెప్పారు. అయితే ఒక్కరోజు కోల్పోయిన మొత్తం ఇంతైతే, సినిమా మొత్తం రన్‌లో మరో రూ.400 కోట్లు ఎలా వచ్చేవనే ప్రశ్న కూడా వస్తోంది. టికెట్ రేట్లు పెంచినా, అదనపు షోలు వేసినా ప్రతి సీటు నిండుతుందనే గ్యారెంటీ ఉండదు కదా.

నిజానికి రజనీ సినిమాకు తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ వెయ్యి కోట్ల మార్కును అందుకోవాలంటే ఇతర రాష్ట్రాలు, హిందీ మార్కెట్, ఓవర్సీస్ వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండాలి. 'జైలర్ 2' హిందీ వెర్షన్‌కు మల్టీప్లెక్స్ సంస్థలతో వచ్చిన ఓటీటీ విండో వివాదం కూడా ఇబ్బందిగా మారింది. అలాంటప్పుడు కేవలం తమిళనాడులో టికెట్ ధరలు, షోల సంఖ్య మార్చినంత మాత్రాన మరో రూ.400 కోట్లు వచ్చేవని అనుకోవడం కష్టమే.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొద్దిరోజుల క్రితమే ఇదే సుబ్రమణ్యం 'జైలర్ 2' వెయ్యి కోట్లు అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి సినిమా రూ.755 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు రూ.807 కోట్లకు చేరుకున్న సమయంలో టికెట్ రేట్ల కారణంగా రూ.1200 కోట్ల అవకాశం మిస్సయిందని చెబుతున్నారు. మరోవైపు 'రామాయణం' విడుదలతో థియేటర్ల పరంగా పోటీ పెరగనుంది.

నెల్సన్ తెరకెక్కించిన 'జైలర్ 2' ఇప్పటికే తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో '2.0' పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అయినప్పటికీ కోలీవుడ్ ఎదురుచూస్తున్న తొలి వెయ్యి కోట్ల సినిమాగా నిలవడానికి ఇంకా దాదాపు రూ.193 కోట్లు కావాలి. ఇక దీపావళి వీకెండ్స్ ఏమైనా కలిసొస్తాయేమో చూడాలి.

Tags:    
  • jailer2 
  • rajinikanth 
  • jailer2boxoffice 
  • tamilcinema 
  • boxofficecollection 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS