• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ సినిమా కోసం...

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

| ఈ క్రమంలో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం సంగీత దర్శకుడుని సెలెక్ట్ చేసే విషయంలో కొత్త మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-03 08:27 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నువ్వే నువ్వే సినిమా నుంచి.. గుంటూరు కారం సినిమా వరకు.. త్రివిక్రమ్ సినిమాలు అన్నిటిలోనూ పాటలు హైలెట్గా నిలిచాయి. కానీ ఈ విషయం ఆదర్శ కుటుంబంలో మాత్రం లెక్కలు తప్పింది.

ఈ క్రమంలో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం సంగీత దర్శకుడుని సెలెక్ట్ చేసే విషయంలో కొత్త మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్‌కు దూరమైన ఆయన, ఇప్పుడు తమన్‌తో కూడా తన ప్రయాణాన్ని కొనసాగించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్‌లో కొంతమంది దర్శకులు ఒకే సంగీత దర్శకుడితో వరుసగా సినిమాలు చేస్తుంటారు. రాజమౌళి తన మొదటి సినిమా నుంచి కీరవాణితో కలిసి పనిచేస్తున్నారు. సుకుమార్ కూడా దేవిశ్రీప్రసాద్‌తో ఎన్నో సినిమాలు చేశారు. అదే విధంగా త్రివిక్రమ్ కూడా తమన్‌తో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌కు అరవింద సమేత వీర రాఘవ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అల వైకుంఠపురములో,‌ భీమ్లా నాయక్ వంటి సినిమాలతో ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే తదుపరి సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తారని చాలామంది భావించారు.

కానీ ఇటీవల వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా ఈ కాంబినేషన్‌పై అనుమానాలు పెంచింది. ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం మరో సంగీత దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌తో చేయబోయే భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, పాటలు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే దేవిశ్రీప్రసాద్‌తో తన కాంబినేషన్‌ను పక్కన పెట్టిన త్రివిక్రమ్, ఇప్పుడు తమన్‌కు కూడా దూరమవుతున్నారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.

అయితే ఎన్టీఆర్ సినిమా సంగీత దర్శకుడిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో సంగీతం పరంగా చిన్న పొరపాటు జరిగిన అది చిత్రంపై చాలా ప్రభావం చూపియచ్చు. కాబట్టి తప్పకుండా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం తను సాధారణంగా చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టి ఆలోచించాల్సిన పరిస్థితి కచ్చితంగా ఉంది.

Tags:    
  • trivikram 
  • thaman 
  • anirudh 
  • jrntr 
  • telugucinema 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

Copyright @2026

Powered by Blink CMS